పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 195

సీ. తిలకంబుఁ గొప్పుపువ్వులుఁ బూఁతలును గను
పట్టఁగా మెలఁగెడుదిట్టవిటులు
నిఱుకిండ్లఁ బాతిక పరక ముడ్చి
గొని ముసుంగిడి చొచ్చుగూఢవిటులు
బోఁటికత్తియలు పల్మాటును బిలువఁగా
మెరవడిఁ దాయేఁగు మేటివిటులుఁ
గనియుఁ గానకయుండఁగా నోరముసుఁగుల
నగపడ్డచో నిల్వఁ దగినవిటులుఁ
ఆ. బెట్టలేమి వెడలఁగొట్టిన చోటికి
బొంచి పడపు చెఱచు క్రించువిటులుఁ[1]
గ్రందుకొనఁగ వారకాంతలవాడలఁ
బచ్చవింటివాఁడు పెచ్చు పెరిగె. 241

వ. అట్టియెడఁ గొందఱు విటులు లంజియలతల్లుల బిఱుసులకు వెఱచి యందఱు నొక్కెడఁ గూడి తమలో నిట్లని విత్కరించిరి. 242

క. మునుమున్నుగ గొఱియలుఁ గూ
డును మొదలుగ నిడక చనువిటునిఁబణ్యస్త్రీ
జనని మెడ విఱిచి కొను నది
ధనముపయిం గాచియున్న దయ్యము చుమ్మీ. 243

వ. అనుడు మఱియు నొకరుం డిట్లనియె. 244

క. వారాంగన మధురసవి
స్తారాకృతి యనఁగఁ జెల్లు దజ్జనని విటుం
జేరఁగనీ దచ్చట సహ
కారఫలము పొంతనున్న కడుఁదురు చుమ్మీ. 245

  1. చొచ్చివెరవు చెరచిపుచ్చువిటులు