పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196 సింహాసన ద్వాత్రింశిక

వ. అనిన మఱియు నొక్కరుండు. 246

క. వెలయాలితల్లి కూఁతుం
గలఁచి విటుఁడు వచ్చెనేనిఁ గలుషించినఁ దాఁ
దలతోన మింగునది ని
ర్మలజల మగు మడుగులోని మకరము చుమ్మీ. 247

వ. నావుడు నితరుండు. 248

క. పరికింప లంజతల్లికి
దొరయైనను దుచ్ఛుఁడైన దొరకినఁ జాలుం
బొరిగొను నది యీపురిలో
నరమోహిని నంటియున్న నరభోజిసుమీ. 249

వ. నా విని యపరుండు. 250

క. పుడమి నిఁక లంజతల్లిం
గడుమీఱిన యట్టికీడు గలదే యది యె
య్యెడఁ జూచినఁ గూతునకు
న్మెడకోణము దొడ్డగుదియ[1] మిండలకెల్లన్. 251

వ. అనవుడుఁ దోడివాఁడు. 252

క. ఆకూఁతుఁ గన్నయప్పుడ
చేకొని తజ్జననియాకుఁ జింపక వెడఁగై
లోకేశుఁడు పామునకుం
గాకికిఁ గలయాయు వేల కలుగఁగఁజేసెన్. 253

వ. అనినం దత్సఖుండు. 254

ఉ. ప్రేమరసంబు తేటలనఁ బెక్కుగుణంబులు గూర్చి వారకాం
తామణుల సృజించి పరతంత్రతఁ ద్రోయఁగనున్న దిగ్గనం[2]

  1. త్రాపుగుదియ
  2. తో దనయున్న దెగ్గునన్