పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194 సింహాసనద్వాత్రింశిక

క. నావుఁడు నావీరవరుం
డావిప్రునిచేతఁ బోఁకలాకులు విరులున్
రోవెలయుం దగఁ బంపిన
నావెలఁదియు నందుకొనియె నతివిస్మితయై. 237

సీ. అయ్యెడ దశరథునాజ్ఞపోలిక బ్రహ్మ
కట్టడి గాలంబు గడవరాక
జనకజ కెనయైన దినలక్ష్మి తనతోడు
నీడకైవడిఁ దోడఁ గూడినడువ
సౌమిత్రిగతి [1]మునిసవనంబునకు మున్ను
దోడైనయరుణుండు తోడుగాఁగ
సాకేతపురిలోన జనులవక్త్రంబుల
నడువున జలజము ల్వాడువాఱఁ
తే. గైకవంకవారిపగిదిఁ గలువ లుబ్బ
జిత్రకూటముక్రియ నస్తశిఖరి దాఁటి
రాక్షసులభంగి నటఁ దిమిరంబునడువ
వనముసొచ్చె రఘువరునివరుస వినుఁడు. 238

ఆ. గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో
వ్రాలఁ జుక్కలు దలఁబ్రాలుగాఁగఁ
గెంపు హోమవహ్నిక్రియ నొప్పఁగా ద్విజ
రాజు పెండ్లియాడె రాత్రిసతిని. 239

క. నలఁగినవిరులును గుఱుమా
పులయిన చీరలును నుదుటి బొట్టులు నెడగా
జులుఁ గమ్మటాకులును సొ
మ్ములుగాఁ దమక్రంతలందు మురిసిరి జంతల్. 240

  1. సాహసమునకు మున్నుగా