పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176 సింహాసన ద్వాత్రింశిక

శ్రుతి యుతుండు నయ్యు శ్రుతిహీనజీవమై
పెనఁచి మ్రింగుచుండు భేకములను. 148

క. అని శపియించిన నే నా
తనికిన్ ధరఁ జాఁగి మ్రొక్కి తప్పు గలదు శి
ష్యునిఁ గరుణింపుము మునుచది
వినచదువుల దురిత మెడలి విరతియుఁ గలుగన్. 149

తే. అనుడు నామాట దప్పదు వినుము నీకు
వేదము ల్మూఁడు పడగలై వెలయుఁగాన
శంఖపాలుండవై జలాశయముఁజేరి
మూఁటిఁదినుమని పద్యంబు మొదలఁజెప్పె. 150

క. “గుండియ చెదరక భువి నె
వ్వండైన నిజాంగ మిచ్చువాఁడు గలిగినన్
గండూపదీయుతం బగు
మండూకౌఘంబుతిండి మానుదుఁ జుండీ." 151

క. ఈకరణిం జరుపుచు[1] నీ
వాకడ ముమ్మాటు దిరుగునవసరమునఁ ద
ద్భేకములఁ గావ ధైర్యము
గైకొని యొకఁ డడ్డమైన గతిఁ గను మనియెన్. 152

క. కావున నిట నురగాకృతి
నీవిధమునఁ దిరిగి చదివి యిన్నిటిఁ గలయం
గా వధియించితిఁ గడపట
నీవెరవున దురిత మెల్ల నీఁగితి ననఘా. 153

  1. వ. అనుచున్
    క. ఈకందముఁ జదువుచు