పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 175

తే. [1]మ్రోయు జేగంటచాడ్పున మ్రోగి మ్రోగి,
చదివి తిరిగెడునాగేంద్రునెదురనుండి
నీకు నాహార మిప్పుడు నేన యైతి
నిలిచి కైకొను మనుచు నియ్యెలుక పలికె. 145

క. ఆపలుకున భుజగము తన
రూపంబు పరిత్యజించి రుచిరాకృతి వి
ద్యాపారంగతమతి యన
దీపించెడు విప్రుఁడై నుతించుచుఁ బలికెన్. 146

క. మూషకకులతిలక దయా
భూషణ నీనుఁ బోలునట్టి పుణ్యులు గలరే
భాషణమాత్రంబున ని
ర్దోషుఁడ నై బ్రదుకఁ గంటిఁ దొల్లిటిభంగిన్. 147

సీ. తాపసుం డగుదీర్ఘతముఁ గొల్చి సాంగయు
క్తంబుగా వేదత్రయంబు చదివి
యతనిచే దేవకార్యమునకు నామం
త్రితుండనై యుండఁగా దొర యొకండు
తనయింటి పితృకార్యమునకు రమ్మనవుడుఁ
దగ్గృహంబునఁ బదార్థములు పెక్కు
గలుగ నూహించి యక్కడి కేఁగి కుడిచిన
విని ఋషి చనుదెంచి నను నదల్చి
ఆ. మునుపు మాకు నీయకొని యట చని కూడు
కుడిచి తీవు కుడువఁ గూడ దనక

  1. మోసియున్నట్టి ఘోరమౌముఖము లడర