పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 177

క. దీర్ఘతముని శాపం బను
నిర్ఘాతము సోఁకి వచ్చి నీవచనసుధా
నిర్ఘర్షణమున మంటిని
దుర్ఘట మిది యనఁగ వింటిఁదుది గతిఁ గంటిన్. 154

మ. అని చెప్ప న్విని మూషకంబు గడుఁ జోద్యం బంది యవ్విప్రుఁ దో
డ్కొని తా నుండు బిలంబుఁ జేరి యిదె కైకొమ్మంచు నం దున్న కాం
చన మెల్లం గొనివచ్చి యిచ్చి యుచితస్నానప్రదానస్పృహం
జనియెం గాశికి ధర్మరాశికిని మోక్షశ్రీప్రయోరాశికిన్. 155

మ. ధరణీదేవకుమారుఁడు న్మగిడి యుత్సాహంబుతోఁ దత్సరో
వరతీరంబున మూషకేశ్వరము నా వర్తిల్లు తీర్థంబు నీ
శ్వరగేహంబును గల్గఁ జేసి చని యాచార్యుం దగం గాంచి సు
స్థిరమౌ భక్తిఁ జతుర్థవేదముఁ బఠించెన్ ధర్మనిర్మాతయై[1]. 156

సీ. ఈవిధంబున నొక్క యెలుక ధర్మము సేయఁ
జింతించునంతలో సిద్ధి యయ్యె
సర్వలక్షణముల సంపూర్ణుఁ డవు నీవు
నీతలంపున నీది నిండు టరుదె
యదిగాన నొండెద్ది యైన న న్నడుగుము
నావుడు వసుమతీనాయకుండు
చెఱువు గట్టించిన సెట్టిధర్మం బెల్ల
సుడివడకుండఁగ నడపు తల్లి!
తే. యే నొనర్చునట్టి యీచేఁత మానవు
లెఁఱుగకుండఁ జేయు మిదియ చాలు
ననుచు మ్రొక్కి వీడుకొని గూఢచారియై
యిచ్చమెచ్చి మగిడి వచ్చెఁ బురికి. 157

  1. నిర్ణేతయై