పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 171

రిటి నాగేంద్రుఁడు చని దా
పటికప్పల[1] మ్రింగఁ జొచ్చి పద్యము చదివెన్. 124

క. “గుండియ చెదరక భువి నె
వ్వం డైన నిజాంగ మిచ్చువాఁడు గలిగినన్
గండూపదీయుతం బగు
మండూకౌఘంబుతిండి మానుదుఁ జుండీ." 125

క. అని ముమ్మాటు ముఖత్రయ
మునఁ జదువుచు మడుఁగుచుట్టు ముమ్మాఱు వివ
ర్తనచేసి మూఁటి మ్రింగును
ననుదినమును వ్రతముపోలె నచటం దిరుగున్. 126

శా. ఈమర్యాదల నున్నదాని చరితం బేపారఁగాఁ జూచి వి
శ్రామార్థంబుగ నొక్కకాకి చని వృక్షశ్రేణిపై బాంధవ
స్తోమంబు న్వినిపించి నిల్వక మహాచోద్యంబుగా నుత్తమ
ప్రేమాఢ్యం బగు మూషకంబునకుఁ జెప్పెం దత్క్రమం బేర్పడన్. 127

క. ఆమూషక మిది చూడఁగ
నీమహిఁ గడుఁ జిత్ర మనుచు నిచ్చఁ గుతుక ము
ద్దామముగఁ గాకితోడుగ
నామడువున కేఁగి యచటి యవనిజ మెక్కెన్. 128

క. ఆతరువుమీఁద నుండుచు
నత్తఱి నుదకంబులోన నహిభీతిఁ గడుం
గుత్తుక తుకతుక యనఁగాఁ
దత్తఱపడుచున్న భేకతతిఁ బొడఁగాంచెన్. 129

  1. యప్పటికప్పల