పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172 సింహాసన ద్వాత్రింశిక

ఆ. బ్రహ్మ “కప్పకాటు బాఁపనపోటును"
లేకయుండఁ జేసెఁ గాక నేడు
గలిగెనేని వైరిఁగని యిన్ని దునుమవె
దైవలిఖిత మేల తప్పు ననియె. 180

క. ఆలోనను వెడలి మహా
వ్యాళము చదువుచును మడుచు వలగొనఁగాఁ ద
త్కాలంబున మూషక మిటు
చాలం గృపువుట్టి వాయసంబున కనియెన్. 131

చ. అలిగి వధించినప్పు డొరు లడ్డము వచ్చిరయేని నాఁడుఁగ
ప్పల మగకప్పల న్విడువఁ బంతముచేసె వడిన్ భుజంగ మీ
మ్ముల మన మడ్డమై నిలిచి ముక్తుల మౌదము రమ్ము నావుడుం
గలఁగి ఖగంబు బుద్ధి యిదిగాఁ దనుచుం దలయూఁచి యిట్లనున్. 132

ఉ. అన్నలొ తమ్ములో చెలులొ యాత్మజులో చనువారు వీరికై
మిన్నక చావనేల యిది మేలె భువిన్ బలిభోజి నయ్యు నా
యున్నెడ విశ్వసింప నొరునొద్దకుఁ జేరఁ బ్రమాద మైనఁ గ
న్సన్న నెఱింగి యొండెడకుఁ జాఁగుదుఁ బ్రాణముతీపి చూచితే. 133

క. వలవనిపని యిది ఫల మని
చలమునఁ దాఁ జచ్చి పడయుసంపద లేలా
యిలఁ బ్రాణము గలిగిన [1]బి
బ్బిలియా కేఱి తినవచ్చుఁ బెక్కుదినంబుల్. 134

ఆ. మనుజుఁ డ్కొఁ డేటమునిఁగెడు దిగి నిల్వఁ
బట్టు మనిన భంగి నిట్టు నీవు[2]

  1. బ్రబ్బిలియా కేఱి
  2. డొక్కఁడు (మనగు) గునుకుదియె (యే)డుగోదానఁ బెట్టు మనినభంగి నిద్దనీవు-చిఱుత కట్టి.. చిన్నయసూరిగారు