పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 169

తలవెఱగొంగ రాత్రికులదైవము చల్లనిరాజు పంకజం
బుల ముకుగొయ్య[1] యచ్యుతుని ముద్దుమఱంది వెలింగె నయ్యెడన్. 115

క. కొడుకుసిరిఁ జూడ నుబ్బునఁ
గడఁగి వడి న్వెడలి వచ్చి కడు మీఱినపా
ల్కడలి యన నిండువెన్నెల
గడలుకొనుచు నెల్లకడలఁ గడు బెడఁ గడరెన్. 116

సీ. దిక్కులు గలయంగఁ బిక్కటిల్లిన పండు
వెన్నెల యాపాలవెల్లి యనఁగ
ముత్తియంబులభాతి మొత్తమౌ తారకా
గణములు లహరికాగణము లనఁగ
నుజ్జ్వలాకారమౌ నుడురాజబింబంబు
సెజ్జయై మెలఁగిన శేషుఁ డనఁగ
నందమై మృగనాభిబిందుసుందర మైన
యందులకందు ముకుందుఁ డనఁగ
ఆ. నట్టివేళఁ గువలయానందకందమై
పుణ్యములకుఁ గలితభోగములకు[2]
గారణంబునాఁగఁ గందర్పజనని యై
రజనిలక్ష్మి మిగుల భజనకెక్కె. 117

ఉ. ఆతటిఁ బార్థివుండు సమయం బిదె నిర్జన మంచు నిల్చి త
త్సేతువుమీఁద రక్తబలిదేవత[3] నిష్ఠఁ దలంచి ధర్మవి
ఖ్యాతముగాఁ బరోపకృతికై తల యిచ్చెద నంచు నుబ్బుచుం
జేతికృపాణమల్ల మేడఁ జేర్చె మెఱుంగులు తొంగలింపఁగన్[4]. 119

  1. పంకజంబుల కెదురెక్క
  2. యానందమై పుణ్యభాగులకును వారిభోగములకు
  3. రక్తజలదేవత
  4. కృపాణ మెత్తి మెడఁ జేర్చె మెఱుంగు త్రురంగలింపఁగన్