పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168 సింహాసన ద్వాత్రింశిక

క. ఇటునటుఁ జనకుండగఁ జెం
గటఁ జంద్రుం డాఁక నిడిన గతిఁ దప్పినచీఁ
కటి చెలికాండ్రన నంబుజ
పుటములలోఁ జంచరీకములు తగులొందెన్. 112

క. భాగీరథియుదకంబు న
భోగంగయు వేఱుసేయఁ బోల దనుచు న
వ్వాగీశుఁడు గూర్చెనొ యన
వేగన భూగగనములను వెన్నెల నిండెన్. 113

సీ. తొలితొలి లేఁతవెన్నెల నారమ్రింగుచుఁ
దనియఁ బిల్లలనోళ్ళఁ జొనిపి చొనిపి
ముదురువెన్నెలఁ బట్టి చదియంగ నమలుచు
మెచ్చుచుఁ బిల్లల కిచ్చి యిచ్చి
పండువెన్నెల దొడఁ బలుమాఱు నొక్కుచు
గమిగూడి యందంద కమిచి కమిచి
వెలినార సాఁగెడు వెన్నెలకాఁడలఁ
ద్రొక్కి ముక్కునఁ ద్రెంచి బొక్కి బొక్కి,
తే. చొక్కి తత్ప్రవాహములోన సోలిసోలి
యడ్డమీఁదుచు గడ్డపై నాఁగియాఁగి
యెనసి బలఁగముతోఁగూడ[1] మునిఁగిమునిగి
కోరికలు మూరిబుచ్చెఁ[2] జకోరచయము. 114

చ. కలువలవిందు జక్కవలకందువ వెన్నెలతీవదుంప ము[3]
చ్చులమెడకోణ మంగజునిచూపరి చూపులయింపు జారకాం

  1. యెనసి బుడుగుల యట్టులు మునిఁగి - బుడిగి= బుంగముంత చి. సూ.
  2. మూగిముంచె
  3. రాజుల మెడకోణ