పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 157

డినపండ్లును సిద్ధాన్నం
బును దడయక కొన్నవాఁడె భువి జాణ యగున్. 59

వ. అనినం బద్మావతి యీనీతివాక్యంబు దప్ప దిప్పటి కుసుమంబులు దివ్యంబులని యిచ్చుటం జేసి తోడియాతండు దేవతార్పణంబు చేసి మఱిముడిచికొనం దలంచె నెయ్యి పాలలో నొలుకు టయ్యె దేవతాపరాయణుం డగుట సకలమంగళహేతువు మానుషబలంబుకంటె దైవబలంబు ప్రబలంబు మఱి యింతియకాదు. 60

క. ఆకుసుమంబులు దేవత
కై కోరికి డాఁచీకొనినయది చూడఁగా
నీకడకు వచ్చునెడ ననుఁ
గైకొనుటకు మ్రొక్కు టొకటి గలుగఁగఁబోలున్. 61

మ. అనినం గూఁతు నలంకరించి మది నెయ్యం బెచ్చటం బుట్టె నా
తనిపై వైవుము వాఁడె భర్త యని నూత్నంబైన పుష్పస్రజం
బెనయం జేతికి నిచ్చి బంధులు నిజాభీష్టార్థముల్[1] వచ్చుక్రం
దున వాద్యంబులు మ్రోయఁగా నెలమితోఁ దోడ్కొంచు నేతెంచినన్. 62

క. రత్నద్వీపంబునఁ గల
రత్నంబులలోని దివ్యరత్నము[2] కన్యా
రత్నము దా వనమాలిక
రత్నోద్భవుమీఁద వైచె రాగం బడరన్. 63

వ. అవ్వేళం బద్మినీరాగకరణంబగు గగనరత్నంబుపగిదిం బద్మావతీకృతానురాగుం డగురత్నోద్భవు శుభోదయంబునం జంద్రకేతుండు ప్రభాతచంద్రుక్రియం బ్రభాహీనుండై లోను గుందుచు జలధిఁబడందలంచిన నది

  1. భీష్టౌఘముల్
  2. మొదలిరత్నము