పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158 సింహాసన ద్వాత్రింశిక

తెలిసి యాసెట్టి తనతమ్ముని కూతుఁ గుముద్వతి నిచ్చెదనని యతనిరాక సఫలంబుగా ననునయించి తెచ్చి. 64

ఉ. సంపద సొంపుమీఱఁగఁ బ్రసన్నమనస్కుఁడు సెట్టి వేడ్కతోఁ
బెంపడరంగ నల్లునకుఁ బెండిలిచేసి తదీయసత్క్రియా
లంపటుఁడై సువర్ణదశలక్షధనం బరణంబు నిచ్చి యా
దంపతు లుల్లసిల్లఁగఁ బదంపడి వారల నంపె నింపునన్. 65

క. రత్నోద్భవుండు నిట కతి
యత్నంబున వచ్చి వంచితాప్తజనుండై
నూత్నవివాహశ్రీ యగు
పత్నిం జేపట్టి నాదుభవనము సొచ్చెన్. 66

వ. చొచ్చి ప్రణమిల్లి. 67

శా. దేవా మ్రొక్కిదె వచ్చె నంచు శితశస్త్రిం గంఠనాళంబు స
ద్భావాధిక్యము దోఁపఁ ద్రెంచుకొనినం బద్మావతీకన్య ప్రే
మావేశంబును భక్తియు న్నిగుడఁగా నాభంగి నిచ్చో నిజ
గ్రీవాచ్ఛేదము చేసి వ్రాలెఁ బతిపైఁ గీర్ణోచ్చలద్రక్తయై. 68

చ. అటఁ దమమూకలోన హితు లాతనిఁ గానక జాడ వట్టి యి
చ్చటి కరుదెంచి తున్కలయి చచ్చినవీరలఁ జూచి మద్గృహం
బిటనట నాదటం బోరలి యేడ్చుచు నెత్తులు మొత్తుకొంచు ను
త్కట మగుదుఃఖవహ్నిఁ గడుఁ గ్రాఁగిరి వేఁగిరి దోఁగి రశ్రులన్. 69

సీ. తదనంతరంబ యిద్దఱ నెత్తికొని వెలి
కరుగఁ జూచిన నేను గరుణ కల్మి
మీలోన నొక్కఁడు మిడిదల యిచ్చిన
దంపతుల్ బ్రదుకుట తథ్య మనిన