పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152 సింహాసన ద్వాత్రింశిక

త్రోవన యేగి యచ్చటి సరోవరతీర్థము లాడి రక్తపూ
జావృతుఁడైన భైరవుని సద్మము డగ్గఱి సెట్టి మాన్పఁగన్. 31

శా. తద్వారంబున సెట్టినుంచి చని యంతర్వేదిపై భుక్తిము
క్తిద్వారం బగు కాళినాథునకు భక్తిన్ మ్రొక్కి సంతుష్టుఁడై
యుద్వేగస్థితినుండి ధైర్యమతితో నుర్వీశుఁ డచ్చో మను
ష్యద్వంద్వద్విశిరఃకబంధములుఁ బద్యంబు న్నిరీక్షించుచున్. 32

క. తద్యోగవ్యంజక మగు
పద్యార్థం బెఱిఁగి దాని భావంబునకున్
సద్యోనిర్ణయముగ నృపుఁ
డుద్యోగము చేసె సాహసోద్యోతితుఁడై. 33

ఆ. భూపశేఖరుఁడు “పరోపకారార్థ మి
దం శరీర" మనుచుఁ దలఁపుకొలఁది
మృత్యుజిహ్వవోలె మెఱుఁగులీనెడునట్టి
కడిఁదియడిద మెత్త మెడకుఁ బూనె. 34

క. ఆలోన నతని సాహస
మాలోకించుచుఁ బ్రసన్నుఁడై పార్థివ నీ
పాలం గల్గితి నని భూ
పాలునిఖడ్గంబు క్షేత్రపాలుఁడు పట్టెన్. 35

ఉ. అప్పుడు మొండెముల్ దలలు నంటుకొనంగ వధూవరుల్ ప్రియం
బొప్పఁగ లేచి మొక్కిన సముత్సుకమానసుఁ డౌచు భైరవుం
డిప్పటిసాహసంబునకు నే నిదె మెచ్చితి నిష్ట మేర్పడం
జెప్పుము నీకు నిత్తు నిటఁ జేకుఱు నన్న నతండు మ్రొక్కుచున్. 36

ఆ. దేవదేవ వీరి కీవిధంబున శిర
శ్ఛేద[1] కృత్య మేల సిద్ధ మయ్యె

  1. దేవ వీరికిట్టి తెఱఁగున నీశిరశ్ఛేద