పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 151

ల్లన నేతెంచి మహితలేంద్రు నధికాహ్లాదంబుతోఁ గానుక
ల్గొని దర్శించిన నావణిక్ప్రవరు సద్గోష్ఠిం బ్రియం బందుచున్. 25

ఆ. వైశ్యచంద్ర నీవు ద్వారకానాయకు
చరణసేవ కేగి తెరువు నందుఁ
గ్రొత్త యేమి గంటి వత్తెఱం గెఱిఁగింపు
మనిన ధనదుఁ డిట్టు లనియెఁ బతికి. 26

క. ద్వారవతి కేగు తెరువునఁ
బారావారంబులో నుపద్వీపమునన్
భైరవుగుడిలోపల నతి
భైరవభావార్థమైన పద్యముఁ గంటిన్. 27

వ. అది యెట్టిదనిన. 28

ఆ. ఎవ్వడైన నిచటి కేతెంచి తనతలం
దానె త్రెంచుకొనినఁ దత్క్షణంబ
[1]మొండెములును దలలు రెండు నంటుకొనంగఁ
బతియుఁ బడఁతుకయును బ్రదుకఁగలరు. 29

క. కథ గాదిది ముందట నా
మిథునము మొండెములు దలలు మేదినిఁ బడవే
ప్రథహేతుపులైనవి త
త్కథనంబున నామనంబు తలఁకెడు నిపుడున్. 30

ఉ. నావుడు విక్రమార్కుఁడు మనంబున నుత్సుకుఁడై వణిక్పతీ
నీ వటు రమ్ము పోద మని నిర్మలఖడ్గసహాయుఁ డౌచు నా

  1. రుండములకుఁ దలలు రెండునంటుకొనంగ? - తుండములకుఁ దలలు రెండు- చిన్నయ్యసూరి