పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124 సింహాసన ద్వాత్రింశిక

క. అనలము! బన్నగమును దు
ర్జనుఁ డుదకముఁ గపియు[1] బ్రహ్మచారియు వారాం
గనయును నృపుఁ డగసాలెయుఁ
దనవా రని నమ్మవలదు తత్త్వజ్ఞునకున్. 114

క. అనవుడు నివి నీతులు గా
వన వచ్చునె విభునితోడ నాడినపంతం
బున నీపదిరత్నంబులు
గొని చని దర్శించి రాజు గొలువఁగవలయున్. 105

క. తలకొను మని ప్రార్థించిన
వలనుగ నాకార్యగౌరవ మ్మెఱిఁగి యతం
డలయక యిది సం దనుచును
వలనొప్పఁగఁ బుంటిచేయి పట్టినభంగిన్. 106

ఆ. అవనిపాలుఁ గొల్వ నవసరం బైనచోఁ
జాలు నింతవడి విచార మేల
యైదుమానికంబు లందు నా కిచ్చిన
నిట్టె యవలిదరిని బెట్టువాడ. 107

వ. అనిన. 108

సీ. అడిగిన రత్నంబు లన్నియు నిచ్చితి
నేని రాజద్రవ్యహాని పుట్టు
నీఁజెల్ల దని యున్న నీదినం బిచ్చోటఁ
దప్పెనా రాజాజ్ఞ దప్పఁ గలుగు
నిలలోనిధనికుల యిండ్ల హయంబులు
ధనధాన్యములును గాంచనము మణులు

  1. బాచికలును దుర్జనుండును గన్యకయు- దుర్జనుఁడు జలంబులును