పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 123

వాన బోరునఁ గురియంగ వఱదనుండి
మిఱ్ఱుఁ బల్లంబు నొక్కటై మేరమీఱె. 97

ఉ. దందడి దందశూకసమధారలు తోరము లై పడంగ మ
ధ్యందినవేళ యైన నభ మంతయుఁ జేకొని చీఁకుపర్వ న
క్తందినచిహ్నము ల్మఱవఁగా నటు బోరన వాన నట్టి దై
నందినకల్పమో యిది యనన్ జలపూరము నిండె ధారుణిన్. 98

వ. అట్టి వర్షోత్కర్షంబున మార్గంబు జలదుర్గమం బైన. 99

క. తత్కాలమ్మున నిలువక
యుత్కోచము చేసి తప్పియును భవదాజ్ఞా
సత్కారముఁ దలఁపుచుఁ[1] జని
యుత్కూలజలాఢ్య[2] మైన యొకనదిఁ గంటిన్. 100

ఆ. అచట నిలుచునంత నవ్వాన వెలియఁగ
నొకఁడు వచ్చె వాని యొద్ధి కేగి
దైన్యమొంది యేఱు దాఁటించు మని వేఁడు
కొనిన నాతం డీయకొనక పలికె. 101

క. వినుము మహానది దాఁటుట
యును గురువిప్రార్యనిందయును ధర్మసభా
జనవైరము దైవతలం
ఘనమును బరికింప హానికార్యములు సుమీ. 102

క. నారీహృదయంబును వ్యవ
హారినిజంబును నదీజలాపూరంబుం
జోరుని ధర్మస్థితియును
వైరుల చెలిమియును నమ్మవల దెవ్వరికిన్.[3]103

  1. సలుపుచు
  2. ఉత్కల్లోలాఢ్య
  3. నారుల, వ్యవహారుల, చోరుల, వైరుల యని చిన్నయసూరిగారి పాఠము