పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 125

మృదులాంబరములు మృగమదకర్పూర
చందనంబులుఁ బరిచారగణము
ఆ. ధానధర్మములు సమానమై యుండును
వానికంటె భూమివరుని కలిమి
యెక్కుడగుచుఁ జెల్లు నెల్లదేశంబుల
రాజ్యమనఁగ నాజ్ఞ పూజ్య మగుట[1]. 109

వ. అని విచారించు నెడలఁ దొల్లింటి నీతి తలంపునం బడియె. 110

క. ధనమునకు దానమును దప
మున కాచారమును రాజ్యమున కాజ్ఞయు జీ
వనమునకు యశము విద్యకు
వినయంబును నీతులకు వివేకము ఫలముల్[2]. 111

క. ధరఁ దగువారలకుఁ దిర
స్కరణంబును సతుల కొండు శయ్యయు నుర్వీ
వరులకు నాజ్ఞాభంగము
సరి నివి యాయుధము లేని చావులు గావే. 112

మ. అని చింతించి ధరాతలేంద్ర భవదీయాజ్ఞాసముల్లంఘనం
బున కే నోర్వక యేనుమానికము లాపూర్ణాపగాతోయలం
ఘనపణ్యంబుగ నిచ్చినం గొని లతాగ్రగ్రంథిచే నన్ను నే
పున బంధించి రయంబుతో నతఁడు తత్పూరంబు దాఁటించినన్. 113

ఆ. అరుగుదెంచి నీపదాంబుజంబులు గనుఁ
గొంటి నాజ్ఞఁ నడప[3] గంటి నేఁడు

  1. యెక్కుడై చెలంగు నొక్కరాజ్యంబున
    రాజునాజ్ఞ చాలఁ బూజ్య మగుట
  2. బలముల్ - చిన్నయసూరి
  3. దిరుగ