పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 115

నమ్మంగ బంటుగని[1] యా
సొమ్ములతోఁ బట్టి తెచ్చి చూపిరి పతికిన్. 56

వ. చూపిన నమ్మహీనాథుండును నీసొమ్ములు నీ కెవ్వరు తెచ్చియిచ్చి యమ్ముమనిన నీ వమ్ముచున్నవాఁడ వని యడిగిన దేవదత్తుండను బ్రాహ్మణుండు తెచ్చియిచ్చెనని యాతఁ డెఱిగించిన. 57

ఆ. బంటువలన నెఱిఁగి బ్రాహ్మణు రప్పించి
నిలువఁబెట్టి తప్పుఁ దెలియ నడుగ
నతఁడు మోము వాంచి యపరాధియునుఁ బోలె
నుత్తరంబు లేక యూరకుండె. 58

క. చనువా రటు ధట్టింపఁగ[2]
నసుమానించుచును దైన్య మడరఁగ వెడఁగై
ధనలోభంబునఁ గొనిచని
జననాథా నీతనూజుఁ జంపితి ననియెన్. 59

సీ. అనుడు నారాయణా యని వీనిఁ బట్టి తి
త్తొలిపింపఁ దగు నని పలుకువారుఁ
గాళ్ళును జేతులు గనియలుగాఁ బట్టి
చిదిమింపఁ దగు నని పదరువారుఁ
గాయంబు నుగ్గుగా గలుగానుఁగలఁ బెట్టి
త్రిప్పుట తగు నని తెలుపువారు
మేన వెంటులు చుట్టి పైనగ్గితగిలించి
మిడికింపఁ దగు నని నొడువువారు
ఆ.వె నగుచు జనులు దుర్వధార్హుండు వీఁడగు
ననుచు విన్నవింప నవనివిభుఁడు[3]

  1. నమ్మంగఁ బట్టుకొని
  2. దండింపఁగ
  3. నైనజనులు వీఁ డర్హుఁడు వధకని
    విన్నవింపఁగఁ బృథివీశ్వరుండు