పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114 సింహాసన ద్వాత్రింశిక

ద్దులు చూపుచు నానాఁటికి
బలుదెఱఁగులఁ బెరిఁగె నతనిప్రాణపదంబై. 51

వ. అంత నతండు తచ్చూడాకరణంబునాఁడు నానావిధంబు లగుదానంబుల దీనుల విప్రులం బరితుష్టులం జేసి యాదేవదత్తునకు మఱియు నొకసర్వసమృద్ధగ్రామం బిచ్చి కుమారునిం బరీక్షాధికారం గావించిన బహుమానితుండై బహుదినంబులు తత్కార్యవిచక్షణత్వంబువలన విశిష్టపూజల నొందుచు విలోచనసుతుఁడు త్రిలోచనసుతుండునుం బోలెఁ ద్యాగభోగానురాగంబులం జెలంగుచుండునంత. 52

క. నృపతి యొకనాఁడు గని ని
ష్కపటాత్మ! పరీక్షణాధికారివి నీయ
త్యుపకారమునకుఁ దగఁ బ్ర
త్యుపకారము చాల దనియె నుర్వీసురుతోన్. 53

చ. అనవుడు దేవడత్తుఁడు ధరాధిప యిట్లన కేను నీకుఁ జే[1]
సిన యుపకార మింత నుతిచేసెద వేటికి నంచుఁ దత్ప్రియం
బొనరఁగఁబల్కి కొంతతడ వుండి గృహంబున కేగువేళ నా
తని సుతుఁ జంకఁ బెట్టుకొని తత్తఱ మందుచు వచ్చెఁ జెచ్చెరన్. 54

ఉ. అయ్యెడ వాని డాఁచి కనకాభరణంబులు పుచ్చి బంటుచేఁ
జయ్యన నిచ్చి యమ్ము మని సంతకుఁ బంపిన యంతలోన నేఁ
డెయ్యెడ కేగెనో శిశువు నెవ్వరు చంపిరొ యంచు నేడ్వఁగా
దయ్య మెఱుంగుఱంతు వసుధాపతిగేహము నిండెఁ బెల్లుగన్. 55

క. అమ్మొఱ విని తలవరులు ర
యమ్మున నలుగడల జాడ లరయుచు నొకచో

  1. దేవదత్తుఁడు ధరాధిపరత్నమ యేను నీకుఁ జే