పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 సింహాసన ద్వాత్రింశిక

తనయదుఃఖవహ్ని దనలోనఁ గ్రాఁగుచు
జంపఁబూని తనదు తెంపు దలఁచి[1]. 60

వ. అద్దేవదత్తునితోడ. 61

క. ఆపకారము గా దిది నా
యుపకారము వాసె భూసురోత్తమ విను నీ
యుపకారమునకు నిది ప్ర
త్యుపకారం బయ్యె నింక నోడక పొమ్మీ. 62

ఆ. అనుచు విడిచి మఱియు ధన మిచ్చి యనిపిన
హితులు దూఱి శిశువు మృతికి నోర్చి
యింత దెరువుచూపు టేయుపకారంబు[2]
గాఁదలంచి యేల కావ ననుడు. 63

క. వినుఁ డిట నేఁ గలిగిన నా
తనయుండును గల్గెఁగాక తప్పిన యెడఁ గా
ననమున నితఁడు తలఁగిపో
యిన భేరుండములలోన నే మగుడుదునే[3]. 64

వ. ఇట్లు గాకుండం జేసిన నీరాజ్యంబును సంతతియును నగపడె నాప్రాణంబులు గాచి నన్ను నిలిపినవానికి సెలవు సేయుట యెంత పని[4] నామీఁది యప్పు కొంతదీర్చుకొనం గలిగె నూరకుండుం డనిన. 65

క. పౌరుల్ హితులు దొర ల్పరి
వారంబును రాజు వెఱ్ఱివాఁ డయ్యెఁ గదే
మూరెఁడు త్రోవయుఁ జూపుట
గారాపుంబట్టి చావుగనియుం గాచెన్[5]. 66

  1. పెం పెఱింగి
  2. టిది యుపకారంబ
  3. కాననమున నితఁడెడఁగల బో,
    యిన నీకాననములోన నేమగుదునొకో
  4. నిలిపిన వాని కిది యెంతపని
  5. గాలిం బుచ్చెన్