పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 సింహాసన ద్వాత్రింశిక



క. విశదమగు కీర్తివసనము
కృశరక్షక! సప్తతంతుకృత మయ్యుఁ జతు
ర్దశభువనంబులఁ గప్పెను
వశమే నినుఁ బొగడ శేషవాణీశులకున్. 22

వ. కావున నీ కసాధ్యంబు లే దెట్లన్న. 23

క. ధాత్రీశ పుణ్యనిర్మల
గాత్రులకును జగములో నగమ్యము గలదే
క్షత్రియపుత్రుఁడు విశ్వా
మిత్రుఁడు బ్రహ్మత్వపదవి మేరల మీఱెన్. 24

క. స్వకులోచితధర్మముఁ ద
ప్పక మనువారలకు వలయుపని దుర్ఘటమే?
ప్రకటంబుగ ఋషిపత్నులు
సికతాకలశముల జలము చేరుపుగొనరే. 25

వ. దీనికి దృష్టాంతంబుగ నీవును దీనం గుండఁ జేసి నీరు నించిన నిలుచు నని యిసుక చేతి కిచ్చిన నృపాలుం డందుకొని. 26

క. ఆటు చేసినఁ జిత్రము మి
క్కుటముగ నా దానధర్మగుణసిద్ధునిచే
ఘటితరస మైనసికతా
ఘటి యొప్పెను రసము ఘుటికగట్టినభంగిన్.27

[1]

  1. ఉ. ఆగతి గుండ నిల్చిన ధరాధిపుఁ గన్గొ‌ని నారదుండు నీ
    వీగతిఁ బుణ్యకీర్తి వెలయించుచు నిచ్చలుఁ దీర్పు సత్ర ము
    ద్వేగములేక చేయుమని తెల్పి వియద్గతి నేగె నంతలోఁ
    ద్యాగము భోగముం దగుసుదర్శనుఁ డచ్చటఁ దాను మెచ్చుచున్.

    గీ. క్రొత్తకడవ తెచ్చుకొని వండి మఱి దాని
    మీఁద వండిపెట్ట మెచ్చు గాదు
    మంటఁ జేసి మొదల మంటనే కఱిగొన్న
    దానఁ దొలుత వండఁ దగుట యెట్లు.
    (ఒక తాళపత్ర ప్రతిలో ఈ పద్యములున్నవి.)