పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 సింహాసన ద్వాత్రింశికచ్చటనుం బాపెడు దిక్కులేక చనుచున్ శైలస్థలిం జేరి ముం
దట సూచీముఖపక్షిఁ గాంచి తనఖేదం బంతయుం జెప్పినన్. 272

క. సూచీముఖంబు డగ్గఱి
నీ చెడుగుందనము మాని నిలువవు నీనో
రోచెల్ల చొరఁగవలె హిం
సాచారివి కాలుఁడైన నలుగఁడె నీకున్. 273

చ. అనవుడు నోరు సొచ్చి వ్యథ[1] యార్పఁగదే మును చచ్చినట్లు ప
ల్లును మెదలింపకుండెద నలోలత నంచు మొగంబు వంటి వ్రా
లిన నది నోరు సొచ్చి కదలించి క్రమంబున దౌడబొక్క[2] ము
క్కునఁ గొనివచ్చె నాపులికిఁ గుత్తుకనాటినకొయ్య నొయ్యనన్. 274

ఆ. అట్లు పుచ్చిన ముద మంది సూచీముఖుఁ
బొగడి యేగి క్రూరమృగము మఱియుఁ
బసులఁ జంపి తినఁగఁ జలలంబుతో దౌడ
నాఁటిజాడ నెముక నాటినంత.[3] 275

ఉ. క్రమ్మఱ వచ్చి పుచ్చు మని కై కొని వేఁడినఁ బుచ్చివైచి స
ఖ్యమ్మొనరించి నిచ్చలు సుఖస్థితి నుండఁగ నొక్కనాఁడు మాం
సమ్మొకయింత గానకయుఁ జయ్యన నాపులి వచ్చి వక్త్రము
న్నమ్మిక దోఁపఁగాఁ దెఱచిన న్విహగంబును జొచ్చె నాక్రియన్. 276

క. చొచ్చినయంతన కాటునఁ
జచ్చె న్విహగంబు పులులసంగడ మిదిగో

  1. నమ్మి చొచ్చి వెతయార్ప
  2. డడొమ్కి ముక్కున గొనివచ్చె నాపులికిఁ గుత్తుక నాటిన కొఱ్ఱు
  3. పుచ్చినను ముదమందుచుఁ బులఁగుఁజాలఁ
    బొగడియును నేగి యా క్రూరమృగము మఱియు
    బసులజంపి తినంగ జాపలముతోడ
    నాఁటిదౌడనె యెముకయు నాటె మగుడ.