పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 57నిచ్చకములాడె దీతని
నిచ్చుటకై యంత యేమి యే నజ్జుఁడనే. 277

క. జాతివిభేదం బేటికిఁ
బాతకునకు నైన నెడరుఁ బాపి[1] మహావి
ఖ్యాతిఁ గొననొప్పుఁ దిర్య
గ్జాతికపోతంబు చెంచుఁ గాచుట వినవే. 278

క. గోదానము ధనదానము
భూదానము నన్నదానమును బథికహితాం
భోదానము నుత్తమవి
ద్యాదానము గూడ నభయదానము సరియే. 279

ఆ. వెన్ను సొచ్చువానిఁ దన్ను నమ్మినవానిఁ
జంపితేని శిశువు జంపుటండ్రు
పంత మెఱుఁగు జాంబవంతునివారము
బాస తప్ప మిట్టియాస విడువు. 280

చ. అనుచు నిరుత్తరంబుగ దయామతిఁ బల్కెడు నంత రాజనం
దనుఁడును లేచినన్ క్షణము దానిఁకఁ గూర్కెద నిద్రవోకుమీ
యని తొడమీఁడ నూఁదికొని యాయెలుఁగించుక కన్నుమూయఁగాఁ
గని పులి వల్కె వాని మెయిఁ గంపము పుట్టఁగ బీతు వెట్టుచున్. 281

ఆ. కోఱలు గలవాని గోళులు గలవానిఁ
గొమ్ములు గలవాని నమ్మవలదు
బమ్మరించెనేని బ్రతుకంగవచ్చునే
యెలుఁగుతొడి చెలిమి యేల[2] నీకు. 282

  1. ఘాతుకునకునైన నెడరుగల్గినఁ దనలో నాతుకనవచ్చు
  2. పొందు లేల