పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 55

గుల్మాదులు దరికొనఁగా
నుల్ముకములభంగి కొన్ని[1] యురగము లెగసెన్. 286

ఆ. ఉరగకులము బోయఁ బొరిగొని శమియించె
నట్లు గాన వీని కడలనేల
పాము క్రూరమండ్రు ప్రాణులలో నెల్లఁ
బాముకంటె నరుఁడు పాతకుండు. 267

క. నామాట నమ్మి డిగ్గన
నీ మనుజునిఁ ద్రోవు మింక నేగెద ననినన్
మోమోటలేక నవ్వుచు
నేమీ సభ్యుఁడవె యనుచు నెలుఁ గిట్లనియెన్. 268

క. ఇలఁ గలపశువుల నెల్లను .
బొలియించుచుఁ బాపములకుఁ బొడవయ్యెడు బె
బ్బులితోడి పొత్తు గలదే
పులి నమ్మియకాదె తొల్లిపులుఁ గొక టిలిగెన్. 269

మ. వినుమా చెప్పెదఁ దొల్లి యొక్క పులి కావేరీతటిం బ్రాణులం
దనయిచ్చ న్వధియించుచుం దినుచు నుత్సాహంబుతో నుండి కా
రెనుబోతుం దినునాఁడు మాంసకబళాన్వీతంబుగా నొక్కబొ[2]
క్క నిజాస్యంబున నొక్కదౌడయెడ వీఁకం జొచ్చిన న్నొచ్చుచున్. 270

క. వదనము విదురుచుకొను చది
తుదినాలుకయెత్తుచేత దూపొడుచుక్రియం
గదలించుఁ దాలువొరఁగ
న్మెదలించుం దగ్గు మ్రొగ్గు మేదినిఁ బొరలున్. 271

మ. ఇటు దుర్వేదనఁ జిక్కి మాన్పుకొనఁగా నెం దేగినం బ్రాణసం
కటమై ప్రాణులు మారి వచ్చె నని డాఁగంబాఱగా నొప్పి యే

  1. మఱియు నురగ
  2. బొక్క - ఎముక