పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
51
ప్రథమాశ్వాసముశా. శీఘ్రాపాతనితాంతతాంత[1]తురగస్వేదంబుఁ దీర్పంగ హృ
ష్టాఘ్రాణంబున మోరయెత్తి తనమీస ల్నిక్కఁ దత్సౌరభం
బాఘ్రాణించి చరించి పొంచి కృతముఖ్యాయామభీమాకృతిన్
వ్యాఘ్రం బొక్కటి వచ్చి యచ్చట నృపవ్యాఘ్రాత్మజుం జూచుడున్. 246

ఆ. హయము దాని రాక కదరి కట్టినవాఁగెఁ[2]
దెంచుకొనుచుఁ బాఱె దిక్కులద్రువఁ
బొరిగొనం దలంచు పులిఁజూచి బెగ్గిలి
విజయపాలుఁ డొక్కవృక్ష మెక్కె. 247

ఉ. అమ్మెయి నెక్కఁ గోపమున నాపులియుం బఱతెంచి తత్ప్రదే
శమ్మున నిల్చిన న్బెగడి శాఖలమీఁదికి డాఁగ నేగియుం
గొమ్మను నొక్క బొల్లియెలుఁగుం గని తల్లడమంది దుర్నిమి
త్తమ్ముగ నాఫలంబు లిటఁ దప్పక వచ్చెనె దైవమా యనున్. 248

క. క్రిందఁ బులి మీఁద నెలుఁగును
నందప్రియనందనుండు నడుమం గలుగ
న్ముందట నొకనుయ్యియు వెను
కందగ నొక గొయ్యిభంగిఁ గానఁగనయ్యెన్. 249

వ. అప్పుడు. 250

గీ. రెండునిలువు లేగయుఁ బుండరీకం బిది
నీకు నచట నుండ నేర్పుగాదు
నమ్మి[3] వేగ మిటకు రమ్ము బాలక యని
యెలుఁగు పిలిచెఁ గాఱు టెలుఁగు సెలఁగ. 251

  1. నితాంతవేగ
  2. యప్పుడవాఁగె— (యెంతయువాఁగె) చిన్నయసూరి
  3. నెమ్మి