పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 సింహాసనద్వాత్రింశికఉ. అక్కొమరుండు దాఁప? హృదయంబు యథావిధి నిల్పి రెంటిలో
నిక్కడఁ గొంత యాస గల దిప్పటి కేగెద నంచు మీఁదికిన్
స్రుక్కుచుఁ జోయెఁ గ్రిందఁ బులి చూచి చలంబున మీర లిద్దఱుం
జిక్కితి రంచు సోఁగి నిలిచెం దనకన్నుల నిప్పు లొల్కఁగన్. 257

ఆ. పుండరీక మిట్టు లొండొండఁ జూపుల
మండఁ గోపవహ్ని మెండుకొనఁగ
నుండు టెఱిగి మాఱుమండుట మానె నా
నెండఱేఁడు గ్రుంకుఁగొండ నడఁగె. 253

క. పులి యాఁగిన జిక్కిన తమ
యెలుఁగును వెదకంగ వచ్చి యెల్లెడఁ గలయం
బొలయు నెలుఁగులో యన గుం
తల మిట్టలఁ జీఁకువాలు దళమై పర్వెన్. 254

క. గగనమణి సాళువముక్రియ
నెగసినఁ దలసూపకుండి యింతట నతఁ డ
స్తగిరిచఱిన్ వ్రాలిన పె
ల్లగు ఖగముల కరణిఁ జుక్క లయ్యెడ నిక్కెన్.[1] 255

శా. ఆవేళన్ భువిఁ బీఁట వెట్టిన మహావ్యాఘ్రంబు నీక్షించుచున్
దైవంబు న్మది దూఱుచుం దలఁకుచుం దద్రాత్రియర్ధంబుఁ జిం
తావేశంబునఁ బుచ్చి కూర్కఁ దలపోయంగా నెలుం గంతయుం
దా వీక్షించి నిజాంకసీమఁ జెలువౌ తల్పంబుగాఁ జూపుచున్. 256

క. నిద్ర చనుదెంచెనేనియు
నిద్రింపుము వెఱవ నేల నీకిట ననినన్

  1. స్తగిరిన్ వ్రాలిన పెల్లగు
    ఖగములక్రియఁ జుక్కలంతఁ గానఁగ నయ్యెన్.