పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 49

సీ. కేరిజంబులఁ గోరి కేరుట దీరించి
పూరేండ్లఁ బుడకల బూడ్దెఁ గలిపి
పాలగుమ్మల నేలపాలుగా నొనరించి
వెలిచెల మెలకువ వెలితిచేసి
బెగ్గురుకదుపుల బెగ్గిల మగ్గించి
కొంగలపొగరెల్లఁ ద్రుంగఁ[1] ద్రొక్కి
కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర
పిండు గుండియలెల్ల బెండుపఱిచి
ఆ. కారుకోళ్ల నెండఁ గారించి గొరవంక
బింక మింక వానిపొంక మణఁచి
చెమరుఁబోతుగములఁ జమరి కౌఁజులఁ జించి
సాళువంబు విజయపాలుఁ జేరె. 238

ఉ. అట్టి ఖగంబువేఁటకు నరాధిపనందనుఁ డిచ్చ మెచ్చుచుం
బిట్టల నెల్ల లోఁబఱిచి భృత్యుల కిచ్చుచుఁ బెక్కువేడుకల్
పుట్టఁగ నొక్కచో మడుఁగు పొంతకుఁ బోయి జలంబు ద్రావి యా
[2]పట్టున మీలఁ గాంచి యొక బారువలం దివియించి యేపుగన్. 239

సీ. కొట్టమీలను దండ్రికొలువులెంకల కిచ్చె
వాలుగలను సంగడీల కిచ్చెఁ
[3]బాఁపమీనుల బిన్నపడవాళ్ళకును నిచ్చె
మారువులఁ జనవువారి కిచ్చె
బేడసంబుల నిచ్చె వేడుకకాండ్రకు
గెండెల బలుదుండగీల కిచ్చె


  1. గ్రుంగ
  2. చట్లునమీలఁగాంచి యొక జాలిక్రియందివి పెంచి
  3. పాపేరలను బస్తుపడుచులకును నిచ్చె. పాఁపరలను.