పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. వానిఁ గనుఁగొని పరివారమ్ము గలగుచు
శకునబలము లేదు చనకు మనిన
విజయపాలుఁ డివియు నిజములో కల్లలో
తెలిసికొంద మనుచుఁ దిరుగఁడయ్యె. 232

క. దుర్మతికి ధర్మబుద్దియు
నిర్మలునకు దుర్గతియు గణికలకు దృఢ మౌ
కూర్మియుఁ గలిమికి నిలుపును
గర్మములకుఁ దప్పుటయును గలుగవు జగతిన్. 238

శా. ఈ రీతిం జను లెల్ల నుల్లముల నూహింపంగ శంపారుచి
స్ఫారజ్యా[1]లలితోరుచాపధరుఁడై సన్నద్ధసైన్యంబుతో
భేరీభైరవభాంకృతు ల్దిశల నిర్భేదింపగా నేగె ని
[2]ష్కారుణ్యుండు సమస్తదుర్గుణగణాణ్యుం డరణ్యానికిన్. 284

ఆ. అచటఁ జెమటకోక యమరించి కుడిచేతఁ
గడిఁదిడేగఁ బట్టి యెడమచేత
నెఱక లొయ్యఁ జక్కఁ జెరివి మోమీక్షించి
కౌఁజుకొక్కెరలను గదియవైచె. 235

వ. ఇట్లొండొంటఁ బులుఁగుల నీల్గించి[3] యొక్క పెట్ట సాళువంబు నెగయించిన. 236

క. తత్ఫక్షపాతరవము వి
యత్పథమున జలచనినద మన విహగము ల
త్యుత్పాతవృష్టిసమయప
తత్పాషాణములు వోలె ధరపైఁ గూలెన్. 287

  1. జ్యాయుతచాపరోపధరుఁడై
  2. ష్కారురుణ్యుం డతఁ డుగ్రపాపజనతాగణ్య
  3. ఇట్లు దొడ్డపులుఁగుల నీక్షించి