పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఆతనికట్టు లూడిచి గృహంబున కంపి యమాత్యుఁ డేగి నే
నా తెఱఁ గట్ల చేసితిఁ బ్రియం బగునే యని చెప్పి వచ్చి త
ద్భీతియు నీతియుం గలుగ భీరునిఁ బాఱుని నేలమాలెలోఁ
బ్రీతి వహించి దాఁచి తనపెంపునఁ బ్రోవఁగఁ గొన్ని యేండ్లకున్. 228

క. పాలసుఁడు కితవ కేలీ
లాలసుఁ డస్థిరుఁడు దురభిలాషుఁడు మృగయా
లోలుఁడయి నందధరణీ
పాలతనూభవుఁడు విజయపాలుఁడు గదలెన్. 229

వ. తదనంతరంబ. 230

సీ. పిల్లులు పోరాడె బల్లి యూరక త్రుళ్ళె
దమ్మళి పొడసూపెఁ దుమ్మి రెదురఁ
దొఱఁగువోయినలేఁగ కొఱలుచు నొక కుఱ్ఱి
పఱతెంచెఁ గ్రంపపై నఱచెఁ గాకి
యులుమఁ డొక్కఁడు నూనె తలతోడ నేతెంచె
మైలచీరలచాకి మ్రోలనెదిరెఁ
[1]గాకియును గొరవంకయును ఱెక్కలపోతు
నేటిరింతయు దాఁటె నెడమదిశకు
ఆ. [2]బైట వెరవుదప్పఁ బాలగుమ్మయుఁ బాఱె
నొంటిపాటఁ బైఁడికంటి వీచె
నెలుఁగుచేసెఁ బెద్దపులుఁగు పామటు దోఁచె
దబ్బి బొబ్బలిడియె నుబ్బులడర. 291

  1. కాకియునొకగొరంకయును. అని చిన్నయసూరిగారు
    కాకియు నొక పెరకయు నెరుకల పోతు
  2. పైటవెరవుదప్పబారె చెమరుపోతు