పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జననియైన శకుంతల నుత్పాదింపఁగోరి, యవ్విధంబున కొడఁబడియె నింతయ కాని, యంతవానికిఁ గంతుసంతాపంబు గలదె కలిఁగెనేని, త్రిజగన్మోహిని యైన రంభ తనకుందానే వలచి వచ్చిన యెడ చట్రాయిఁగా శపించునే!'

'పంటిమొనల వాతెఱ గట్టిగా నొక్కుచు, నెమ్మేనులఁ జెమ్మట లుప్పతిల్ల నొండొరులఁ దొడరి పెనంగి, కళావిలాసంబులు వెలయ, నలసతఁ బొందియు సందీక సరిబిత్తరు లానుకొని కల్లంబునకుం బెనంగి వే మారుసాధనలం జేయు వీరలం జూచితే?'

'జననీ! జెట్లకు వేమారుసాదనలు జేయుట యుక్తంబె కదా!'

'కమ్మవిలుకానిసంగరంబుల ధేనుకబంధంబునం బెనంగు రంభానలకూబరుల వీక్షింపుము.

కరేణుకాబంధంబున భోగించు గురుసతీనిశాపతుల నాలోకించుము.

ఉపరతిక్రీడావిశేషంబుల నోలలాడు నహల్యాపురందరులఁ గనుఁగొనుము.

సింహవిక్రమంబునం గలయు తారాజయంతులఁ జూడుము.

ఊరుపీడనక్రీడలం జోడుగూడు దాశకన్యాపరాశరులం దిలకింపుము.

పద్మాసనంబను బంధభేదంబునఁ బద్మబాణునిసమరంబు సలుపు యూర్వశీవరుణుల విలోకింపుము!'

'జనయిత్రీ! ఇవి చిత్రంబులు; యిందు విశేషం బేమి!' యనియె. ఆ చిత్రాంగి, తానాడు యారజంపుమాటల కెల్ల నొగ్గక నేర్పునం ద్రోసి పల్కు, నక్కుమారుని భావం బెఱుఁగక, నా సైకతనితంబ కడంబించినచండంబున, పొంకంబగు కుంకుమంబును, బ్రోదిమీరు జవాదియు, విరివితానంబు, రత్నభూషణవిసరంబులు, గాజుగిన్నియల, పటికంపుదొన్నియల బంగరుతట్టల నమర్చి, తనర్చిన మోహంబునం దెచ్చి యునిచి, 'యోయీ, వన్నెకాడా! యీ విరిసరంబులు జుట్టుకొనుము, జవాదిచే