Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42. సాక్షి

మాత్రమైన మాఱిపోకుండఁ గంఠరవమునఁ బ్రమాదమున నపశ్రుతి, వెలితి, కంపము గలుకనీయకుండ నక్షరాభ్యాస ప్రథమదినమునఁ బలుకనేర్చుకొనిన రెండవయక్షరము- నుచ్చరించుట యందే యింత భయము, ఇంత దీర్ఘాలోచనము, ఇంత జాగ్రత్త, ఇంత కొంకు పడరానియన్నిపాట్లు తలలో రేగటిమన్ను గాక మెదడున్న ప్రతిమనుజుఁడు పొందవలసినట్లు కనఁబడుచున్నదే! అట్టిచోఁ జిత్రవిచిత్రాతివిచిత్ర విరామ సమ్మేళన సంభూత.. సర్వవిధ శబ్దజాలమును నిర్లక్ష్యముగ, నిర్భీతిగ, నిశ్శంకముగ, నిరంకుశముగ, నిరాఘాటముగ, రాగతాళములతో లంకెవేసి రోఁకళ్ల పాటలు క్రింద, నడుగులదంపుల క్రిందఁ, దందనపదాల క్రిందఁ, బంబదరువుల క్రిందఁ బడఁదీసిపాడి, మడచిమడచి మఱిపాడి, చౌకచౌకముగ సాగఁదీసి పాడి, మందరశ్రుతిలో మండూకరవమునఁ బాడి, పైకాలములోఁ బరుగుపరుగునఁ బాడి, షష్టకాలములోఁ జావుపాటపాడి, ఓ′ సంగతులలో గరగరలు, గలగలలు, జారులు, ఎగుపులు, 'హు'మ్మని మ్రింగుళ్లు, చురచురలు, నమ్మనమ్మని నమలుటలు, చిత్తజల్లు గం గురిపించి పాడిపాడి, ముక్తాయి తీర్చి, చేతులు మోదిమోది, కాళ్లుకొట్టికొట్టి, తల యూఁపియూఁపీ నాటక రంగమును బాటకచ్చేరిగ నాటక సాలగఁ జేసినయెడల నింక రసమేమి? ఉచితత యేమి? యుక్తిసందర్భ మేమి? పాత్రత్వ మేమి? కవి యేమి? కవిత్వ మేమి? మనుజుఁ డేమి? మమజత్వమేమి? ప్రకృతి యేమి? ప్రపంచ మేమి? ప్రారబ్ధము తప్ప మటేమియు లేదు. ప్రపంచ కవిశిఖామణులలో బ్రహ్మజాతివజ్ర మెవఁడో, నాటకకా వ్యాంతరిక్షమున నుదయాస్తమయములు వృద్ధిక్షయములు మాపుమచ్చ లెఱుఁగని యమృ తకరుఁ డెవ్వఁడో యట్టి కాళిదాసుఁడు తాను రచియించిన యభిజ్ఞానశాకుంతలమున కాంధ్ర కవు లాపాదింపఁ జేసిన— యధోగతిని పెట్టిన యంతి వస్థను ఆబ్దిక శ్రాధ్ధతంత్రమును -తననిశ్శరీరాత్మతోఁ జూచునెడలఁ బాపము! ఏమనుకొనునో! నా వెఱియేకాని యే మనుకొనుటకు నేమున్నది? ఏమనుకొన్న నేమి లాభమున్నది? అట్టి దురవస్థయే సిద్ధించిన యాధునికాంధ్రకవు లంగబలసంపన్నులయ్యు నేమనుకొనుచున్నారు? ఏమి చేయుచు న్నారు? హరిశ్చంద్రనాటకము సంగీతహరిశ్చంద్రనాటకమై సద్గ్రంథసముదాయమునుండి జారి జావళీ పుస్తకాల క్రిందఁ బడినది కాదా? సారంగధరచరిత్ర సంగీతసారంగధరచరిత్రయై చచ్చియేపోయినది కాదా? సర్వరాష్ట్రమును గోలుపోయి సతీసుతులతోఁ గాశికిఁ బోయి, వారినమ్ముకొని, తన్ను మాలవాని కమ్ముకొని, చచ్చిన యొక్క కొడుకును శ్మశానమునఁ దగులఁ బెట్టుటకు వచ్చిన సతీమణిని దరవారితోఁ దెగనఱుకఁబూనిన హరిశ్చంద్రునిచరి త్రము సంతాపచరిత్ర మగును గాని సంగీతచరిత్ర మెట్లు కాఁగలదు? ఇంతకంటే నవాచ్యాసం దర్భాధికత యుండునా? 'సంగీతసంఘమరణ"మను గ్రంథనామము తగునా? "సంగీతశ వదహనమను పేరుతో గ్రంథ ముండవచ్చునా?

హరిశ్చంద్రనాటకకర్తను నేనెఱుఁగుదును. ఆయన నీనడుమనే బెంగుళూరునఁ జూచితిని. ఆయన రచించిన స్వతంత్ర నాటకములలో నిది మొదటిది. వీరికి సంగీతమందభి రుచి లేదు. వీరు పాడలేరు సరేకదా! పరులు పాడిన విననొల్లరు. గానరసగ్రహణచణ శ్రవము వీరికిఁ గానరాదు. అట్టి వీరు రచించిన సత్యహరిశ్చంద్రము సరససంగీతమంజరి యయినది. "నాటకమున సంగీత మెచ్చట నుండఁగూడ దను నియమము వీరికున్నది. వీరియభిప్రా యమును దెలిసికొని ప్రదర్శింపవలయు నను నియమము జనులకు లేదు. సంగీత మొక్క రసమునఁ దప్ప రూపకమున మతెక్కడ నుపయోగింపఁదగదు. ఆరసము భక్తి. ఈ భక్తి భగవంతునియందలి యనురాగము. చంచలతమమైన చిత్తము నాతనియందు