పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాటక ప్రదర్శనము!. 41

గలిసికొంటిని. ఈతఁ డేయూరియొద్ద బండిలోని కెక్కినాఁడో నే నెఱుఁగను గాని మారికాపురము కొద్ద "మానరా” యను నీపాట నారంభించి కంబమువఱకుఁ బాడినాఁడు. నే నాపాటను నతఁడు పాడిన దీక్షకంటే నెక్కువదీక్షతో వింటిని. ఆతనిపాటలో నిహాయి నెఱిఁగి కాదు. ఆతని పాటలోని యర్థము తెలియక యింతసేపు వింటిని. “శివునకు మంగళము మానరా” యని మంగళపుటారతి యుండునా? అని నే ననుకొంటిని. తుద కర్థము తెలియక యాగాయకునే యడిగితిని. తనకుఁ దెలియదని యాతఁడు చెప్పెను. ఇంక నేది గతి? అతఁ డర్థముఁ జెప్పు నని కొండంత యాస పెట్టుకొంటిని. ఎటులయిన దానియర్థ మెఱుఁగవలయు నని నాకుఁ బట్టు గలిగెను. మఱి యొక కీర్తన మేదైనా బాడు మని యాతని గోరితిని. పాడు మనుసరికి నాలుక వెనుకాడు స్వభావము ననుసరించి కాఁబోలు నాతఁడు తనకు మజేదియు రాదనెను. అంతట నీయూ రేదని యడిగితిని. "మంగళగిరి" యని యాతఁడనెను - అంతట మంగళగిరి, పానకాలరాయుని నివాసముకదా! పానకాలరాయఁ డనఁగ నరసింహుఁడుకదా! అందుచే నీకీర్తనము నరసింహస్వామిమీఁదిదేమో యని యూహించి "మానరసింహునకు మంగళం జయమంగళం" అని యాకీర్తన మని నేను నిశ్చయపఱచుకొంటిని. జామున్నరసేపు తలఁ గొట్టుకొనినను మెదడుఁ జింపుకొనినను బాట పాషాణప్రాయమైయుండి డొంకతిరుగుడులతోడను, జెడి వ్రేఁతల తోడను, లక్షితలక్షణములతోడను మూఁడునాల్గు మడతలు వైచిసాగఁ దీయుటచేతను దుదకుఁ గట్టుకథవలె నీజిప్టులోని హైరాగ్లిఫిక్సువలె విడెను. కీర్తనము కీర్తనముగ నుండఁగనే యింతమాదిగమంచ మగు నప్పుడు శ్లోకము కీర్తనము గాఁగ నెంత గాడిదగత్తర యగునో శ్లోకములోని శబ్దములకు గానపాకములలో దీర్ఘ మున్న చోట హ్రస్వము, హ్రస్వ మున్న చోట దీర్ఘము దాపురింప, నదుకున్న చోట విరుపు, విరుపున్న చోట నదుకు స్తంభింప, నిలుపున్న చోట సాగుడు, సాగుడున్న చోట నిలుపు ఘనీభవింపఁ దాళపుదబాయింపుల దారినిబట్టి శ్లోకములోఁ గొంతభాగము రెండుమూఁ డావృతులు జోడింపులు తిరుగువ్రేఁతలు పడఁగ శ్లోక మంతయు సంధిసంధిని విఱిగి యెముకలు లటలటలాఁడ, జర్మము దెగి వ్రేలాడ,రక్తముగారఁ, గండలు క్రొవ్వునఁ గలిసి యూడిపడ, ప్రేఁగులు చుట్టలుగ బీభత్సస్వరూపముతోఁ బడిపోవఁ గటికవానిదాగలివలెఁ గడు హేయమై మశకమక్షికాపిపీలికా సంకులమై దుర్గంధభూయిష్ఠమై సంగీతశాకుంతల మంతయు చండాలశాకుంతలమయినదా? లేదా?

ప్రథమరూపక కవితాపీఠము బాకిపెరడుగఁ జేయుపాపము మనకేల? ఆమహాకవి లేఖనవైఖరినిబట్టి సంగీతసందర్భమే నాటకమున నుండఁ గూడ దని కనఁబడుచున్నదే! ఉన్నశ్లోకములుగూడను గానధోరణితోఁ జదువఁదగినవి కాదని యాతని యభిప్రాయమైనట్టుల కనఁబడుచున్నదే! ఈ యంశములఁ గూర్చి నాటకార్ఘ వృత్తపరిశీలన సమయమున విపులముగఁ జెప్పెదను. 'ఆ' యను నొక్క యక్షరమున కుచ్చారణ భేదములఁ బట్టి భేదార్థము లగునుగదా! అందువలన భేదరసము లుద్బోధించునుగాదా? అదియొకసారి ప్రశ్నార్థక మగును. ఒకసారి యాశ్చర్యరసము, నొకపరి తీవ్రకోపరసమును, నొక్కమాఱు కరుణరసము, నొక్కమాఱు భయానకరసము, నొక్కమాఱు సంక్షేపణనిందా గర్భమగు హాస్యరసము నుచ్చరించు విధములఁబట్టి యుద్బోధించును. కవిహృదయమును గుర్తెఱిఁగి పాత్రేచిత్యమును బరిగణించి, యరసందర్భము నవఘళించి యథోచితరసము యవబీజాగ్ర