Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాటక ప్రదర్శనము 43

లగ్నముచేయుటకుఁ బడరానిపాటులఁ బడవలయును. ఏదియో యొక ప్రతిమను ముందుం చుకొనవలయును. దానిని దదేకదీక్షతోఁ జూడలవలయును. దానిని నమ్మకముతోఁ బూజిం పవలయును. దానికి స్నాన మొనరించి యాతీర్థము త్రావవలయును. దానికి ధూపదీపాది షోడశోపచారములు చేయవలయును. దానిని బ్రేమింపవలయును. దాని విశ్లేషమును సహింప కుండ నుండవలయును. దానికి సాష్టాంగపడుచుండవలయును. దానినే సంసారతారకసాధన మని సంపూర్ణముగ నమ్మవలయును. దాని నామమును నిత్యము స్మరింపవలయును. ఇట్లు కొంతకాలము చేయఁగఁ జేయఁగఁ గంటిలో నొకవిధమైన మార్పు గలిగి యానిగ్రహము తేజోవంతమైనదిగ, జీవవంతమైనదిగ, చలనశక్తి సంపద్వంతమైనదిగిఁ గానఁబడును. కన్ను చెదరినకొలంది మనసు దానియందు లగ్నమై యితర ప్రపంచ వైముఖ్యమొందును. అంతట వెఱవెట్టి కేకలు, ప్రార్థనములతోఁ జేరిన పాటలు, పాటల కనుగుణములగు నాటలు, చిత్తావశత్వమువలన సిద్ధించును. ఇట్లు పాడిపాడి, యొడలు తెలియక యాడియాడి పరవశత్వమున భక్తుఁడు విస్మితుఁడై పడిపోవును. ఇది భక్త్యుద్రేకమున కారంభావస్థ. ఇట్లు క్రమక్రమముగ విస్మృతికాలము హెచ్చగును. ఒడలు తెలియని మనుజుఁడు తెయితెక్కలాడు స్వభావము గలవాఁడై యుండును. కాళ్లచిందు లున్నచో గాన ముండి తీరవలయును. ఆటకుఁ బాటకు నత్యంతమైత్రి. అందుచే భక్తిరసమునఁ బాట ముఖ్యముగ నుండవలయును. ఈరసమునఁ దప్ప నీతరరసములందు మిగిలిన పాత్రములచేతఁ బాటలు పాడింపఁ గూడదు. గానమునకు నాటకరంగమున నేమాత్రమైనఁజో టీయఁదగదు.

'ఓపరా' లని పాశ్చాత్యభాషలలో నొకవిధమగు గ్రంథము లున్నవి. ఇవి గాన ప్రధానము లైయుండును. వీనితోఁ గొంచెము హెచ్చుతగ్గుగఁ బోలియుండు నవి మనలోని యక్షగానము లు– ఇవి యిటలీ దేశపువారు పూర్వము దఱచుగ వ్రాసియుండిరి. వాని ననుసరించియే యింగ్లాండు మొదలగు దేశములవారు గూడ తమతమ భాషలలో వానిని వ్రాసిరి. వీనికిఁ బ్రధానమగునది గానము. ఇట్టి గ్రంథప్రదర్శనములఁ గూర్చి Addison (అడ్డిసన్) హేళనముగ, "It is laid down as an established rule which is received as such to this day that nothing is capable of beaing well set to music that is not nonsense” అని వ్రాసినాఁడు. ఇప్పటి మనదేశపుఁ బాటలు నాటకములే ఆ 'ఓపరా' లవంటి వనియు, వానిలోఁ బదము లుండునట్లే వీనిలోఁ గూడ నుండవచ్చు ననియు, వానిని జను లాదరించిన ట్లే వీని నాదరింపఁదగు ననియుఁ బాటలనాటకము లొనర్చుకవు లనవచ్చును. అట్లనుట సమంజసము కాదు. వీరి నాటకములు దశరూపకములలోఁ జేరినవి. యక్షగాన ములు గావు. యక్షగానం లు కేవలగానములు. అవి దశరూపకములలోనివి కావు. దశరూపక ములనునవి గానకాలక్షేప గ్రంథములు గావు. బాహ్యాంతర ప్రకృతిచిత్రపటలుము. Addission (అడిసన్) తిరుగ నాటకస్థ గానార్హతను గూర్చి యిట్లు పలుకుచున్నాఁడు.

"If the Italians have a genius for music above the English the English have a genius for other performances of a much higher nature, and capable of giving the mind a much nobler entertainment. Would one think it possible (at a time when an author lived that was able to write the Phaedra and Hippolinus) for a people to be so stupidly fond of the Italian opera as scarce to give a third