36 సాక్షి
యూరోపు ఖండములోని గ్రీకు లేమి? ఇంగ్లీషువారేమి? ఇంకను మఱికొందఱు
జాతివారేమి? సుఖాంతనాటకములు, కష్టాంతనాటకములు కూడ వ్రాసినారు. ప్రకృతి
ననుసరించి వ్రాయువారందఱటులే వ్రాయఁ దగినదిగాఁ గనఁబడుచున్నది. కేవలము
కష్టాంతరనాటకములను నిరాకరించుట హేతుసందర్భమునకు, శాస్త్రమునకు,
సమాజవైఖరికిఁ బ్రపంచ ధోరణికి, నితర దేశనాటకకర్తల యాచారమునకుఁ గూడ మిగుల
భిన్నముగ నున్నది. ఇట్టి కట్టుబాటు మనలో మాత్రమే యేల ముఖ్యముగ నుండవలయునో
స్పష్టముగ గోచరింపదు. నాటకమధ్యమున నెన్నికష్టములున్నను నాటకాంతమున నాకష్టము
లన్నియుఁ గడతేఱి తీఱవలయును గదా! ఇట్లుండుటకుఁ గారణములేమో కొంత యూహిం
తుము. “కష్టదశలో జనులకు భగవంతుని సాహాయ్యమేదోరూపముగఁ దప్పకుండఁ గలుగవ
లసినది. కష్టము లందుచే నివారింపవలసినవి. అట్లే చెప్పకుండునెడల మనుజులకుఁ గష్టములు
సహింప శక్యము గావు. భగవంతుడు ఆపద్రక్షకుఁడు. తమ ప్రార్థనల విని తమదైన్యముఁ
గాంచి యెటులో యొకటులు తమ్మాపదలనుండి విముక్తులఁ జేయు నను పూర్ణవిశ్వాసము
మనుజులకు నశించును. జనులిట్లు భగవత్ప్రర్థనా విముఖులయి క్రమక్రమముగ నాస్తికుల
గుదురు." ఇది యొకకారణమని యూహింతుము. కాలిమీఁదఁ గురువు క్రమక్రమముగ
నెదుగవలయును. పలుకఁ బాఱ వలయును. చిదుకవలయును. క్రమముగ నారవలయును.
అంతట. బాధతీరవలయును. అంతేకాని యీస్ పుగ నెన్నిప్రార్థనములో యాతఁడు చేసినన
యిన వియోగ మున్నదా? అది యథారీతిగ మానుటకుఁ దీసికొను కాలములో
నొక్కదినమైనఁ దగ్గించుట కెవరికయిన నవకాశమున్నదా? అటులే కర్మఫల మనుభవించి
తీరవలయును. అనుభవకాలములో నొక్కతృటియైనఁ దగ్గించుకొనఁగ నెన్ని
యేడ్పులేడ్చినఁ దగ్గదు. తగ్గించువాఁ డెవ్వఁడు లేఁడు. పూర్ణముగ ననుభవించవలయును. ఆ
యనుభవపూర్తి యయిన పిమ్మట నాయాపత్తంత మందును. ఈయంశములు మనలో
మహావేదాంతి మొదలు మందబుద్ధిశిఖామణి వఱకు సంపూర్ణముగఁ దెలియును. ఇట్టి
యనుభవము నిత్యసంసారకృత్యముల గడియకొక్కసారి యయినఁ బ్రతిమనుజుని మన
స్సునకుఁ దగులుచున్నది. తగిలి యట స్థిరముగ నిలువఁబడి మనస్తత్త్వములో నైక్యమగుచు
న్నది. ఐక్యమై దినదినప్రబలమై మన స్సంతయు నావరించుచున్నది. మనలో-నెంత
విద్యాహీనుఁడయిన నెంత మూఢుఁడయిన నెంత తుచ్చుఁడయినఁ - గష్టములఁ బడున
ప్పుడు “నేను జేసికొనిన దేదో యనుభవించు చున్నాను. ఎంతపాప మొనర్చితినో యంతఫల
మావగింజంతయయిన మిగులకుండ ననుభవించి తీరవలయును." అను నిశ్చయాజ్ఞాన
ముతో నుండును. ఈజ్ఞాన మనునది యపరోక్షజ్ఞాని మొద లాలకాఁపరివఱకే కాక
యధమమైన యంత్యజాతులవారివఱకుఁ గూడ దినదినానుభవములో నున్నది. కష్టములు
రాఁగా నెట్టివాఁడయినఁ దన్ను దూషించుకొనునుగాని భగవంతుఁ డీకష్టము లిచ్చినాఁ డని
కాని, తా నెట్లో తెచ్చుకొన్న కష్టములు భగవంతుఁడు నివారణము చేయలేదని గాని దైవము
నెన్నఁడు దూఱఁడు. అన్నము లేక యేడ్చువాఁడు “పూర్వ మెవనికడుపు మాడ్చితినో.
యని యేడ్చును. సంతతి లేనివాఁడు “పూర్వ మెవ్వని కొక్క కుళ్లుకాయనయిన నీయని
నిర్భాగ్యుఁడనో" యని యేడ్చును. అంతియే కాని దైవమును దూఱువాఁ డెవ్వఁడును
లేఁడు. "ఆపదలందు లొంగి పోకుండ ధైర్యమును గటాక్షింపు" మని భగవంతుని
బ్రార్థించును. అంతేకాని కష్టములు - పరిమితి ననుసరించి పడవలసిన కష్టములు పడకతీరని
కష్టములు-భగవంతుఁడు పాప లేదని ప్రార్థనావిముఖుఁడై యెవ్వఁడు నుండఁడు. జనులు
సాస్తికు లగుదురేమో యను భయము కూడ నెంతమాత్ర మక్కఱలేదు.