నెత్తుటివఱదల పైఁ దేలి కొట్టుకొని పోవుచుండఁగ గుండెకొట్టుకొనకుండనైనఁ జూడమ చ్చును. కాని యుచితజ్ఞతా శూన్యుఁడైన కవి కలముమొనతోఁ బ్రకృతికాంతను హృదయకో శమునఁ బొడిచి చంపి చర్మ మూడఁదీసి సంధులు విఱుగఁ గొట్టి నరములఁ ద్రెంపి రక్తమును ద్రావి పచ్చిమాంసపు కండలను నోటఁబెట్టుకొని నడివీథి కెక్కి తెయితక్క లాడుచుండఁ జూడఁగ-నొడలు చావవలసినదే కన్నులు లొట్టపడిపోవలసినదే గుండెలు బ్రద్దలయి నీరు కారవలసినదే —కన్నున్నవానికి, మెదడున్న వానికి హృదయమున్న వానికి నింతకంటె భయ బీభత్స ప్రదమైన దర్శన మేదియు లేదు. మన మేపూర్వజన్మ పుణ్య లేశముననో మనుజులమై పుట్టితిమే అన్నము తినుచున్నామే గుడ్డ కట్టుకొనుచున్నామే – పెండ్లి చేసికొనుచున్నామే -పిల్లలఁ గనుచున్నామే - మనసులోని యూహములను మంచిచెడ్డ లెఱిఁగి వెలువరించుచున్నా మే వంటయింటిలోనికిఁ బోయి మనభార్యలతో నెప్పుడైన 'బీఱకాయ వేఁ గూరఁ జేయవే -సరిగమ గ రి' |॥ బీఱ | రవపులుసు వేసి || బీఱ! " అను సాయంతన పాకసామగ్రీ సందర్భ) మును సంగీతములో వెల్లడించియుంటిమా? అట్లే చేసియుండినయెడల మనయిరుగుపొరు గువారు మనచేతులు కాళ్లు గట్టి తలలు నున్నగ గొఱిగించి నిమ్మకాయపులుసుతో రుద్ది బెత్తముచే మోది యున్మత్తశాలలకుఁ బంపించియుండరా? అజ్ఞానస్వరూపమగు గ్రుడ్డయి నను గడుపునొప్పి రాఁగఁ గ్యారుక్యారున నేడ్చునుగాని సరళస్వరము పాడునా? ప్రొయ్యి యలుకుచుండఁగఁ దేలుచేఁ గుట్టఁబడిన వనిత మొట్టోమొట్టో యని యేడ్చునుగాని ముఖారి పాడి తాండవించునా? అట్లే చేసియుండిన యెడలఁ దేలుమాట యటుంచి దయ్యపుబాధ యని చీఁపురుగట్టలతో వీఁపు తట్టు దేరఁ జానఁ గొట్టియుండరా? కన్నకొడుకు మరణింపఁగఁ దల్లి తల కొట్టుకొని యేడ్చియేడ్చి కొయ్యవాఱిపోవలసినది కాని మొల గట్టుకొని యుత్కంఠమునఁ బాడిపాడి ముక్తాయించితీరవలసినదా? దూడవచ్చిన యావైన దిగులు పడి, డిల్లపడి, గడ్డిమాని, నీరు మాని, దూడను ముట్టెతో స్పృశించి కంట నీరు పెట్టుకొని తహతహచే గింజుకొని "యంబా" యని యఱచునే- మన మంతకంటే నధనుస్థితి నుండవలసి వచ్చెనే! ఎంతమహా ప్రారబ్ధము పట్టినది! పాట కొఱకే మన మప్పుడప్పుడు పాడుకొనుచున్నాము. పాడించుకొనుచున్నాము. కాని ప్రాపంచిక సర్వవ్యాపారములును బాటలతోఁ గాక మాటలతోడనే మనము నిర్వహించుకొనుచుంటి మని మన మంద తెఱిఁగినయంశమేకదా? ఇట్టి మన సాంసారికన్యాపారములలో రాజకీయవ్యాపారములలో నాముష్మిక వ్యాపారములు మొదలగు నన్ని వ్యాపారములలో మనము మన సంబంధులంద జీతో సంభాషించిన సంభాషణకుఁ, జేసినచేఁతలకు, నడచినడతలకుఁ దలంచిన తలఁపులకుఁ బ్రత్యక్షమైన, స్వచ్ఛమైన యాదర్శముగ నుండవలసిన నాటకములలో నీదరువు లేమి? ఈతాండవము లేమి? ఈపాట లేమి? ఈయాటలేమి? ఈయడుకులదంపు లేమి? ఈమిడి మేలము లేమి? ఆహా! మనుష్యత్వము పశుత్వముకంటె నేడాకులు తగ్గిపోయినదే! ప్రపంచము తలడ్రిందయినదే! ప్రకృతిని మంటఁ బెట్టిరే? ఏమి? ఎట్టు? రోగశయ్యపై రాగాలాపములా? ప్రభుసభామధ్యమునఁ బల్లవి దబాయింపులా? భార్యల ప్రక్కలలో బాఠాంతరము లొందిన జావళీలా? తండ్రిగారి దర్భశయ్యపైఁ దానపు బజాయింపులా! కత్తి కంఠముపై ఖసిక్కునఁ బడఁబోవుచుండఁగఁ గారువాతీఱికలా? ఓహో! ఓహో! కాళిదాసుఁడు మనదేశమునఁ బుట్టినవాఁడేకదా! షేక్సుపియరు నాటకములు చదివినవారము కదా! కన్నులు పెట్టుకొని నిత్యము ప్రకృతినిఁ జూచుచున్న వారము కదా! ప్రశస్తకవులకు విరోధముగఁ-మన మిట్టు
పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/46
Appearance