పుట:సత్యశోధన.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

పోలక్

సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది. ఫినిక్సులో కలిగిన ఊహించని ఫలితాలు, అక్కడ రూపొందిన ఊహించని కార్యక్రమాలు నష్టదాయకమైనవి కావని నా నిశ్చితాభిప్రాయం. ఊహించిన ఫలితాలకంటే మించినవి అవునో కాదో నిశ్చితంగా చెప్పలేను.

అంతా కాయకష్టం చేసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో ముద్రణాలయ సమీపంలో సంస్థ యందలి ప్రతి వ్యక్తికి మూడు మూడు ఎకరాల చొప్పున భూమి కేటాయించాం. వాటిలో ఒక ముక్క నా కోసం ఉంచారు. ఆయా చోట్ల అందరికోసం, వారు కోరకపోయినా రేకులతో ఇళ్ళు నిర్మించాం. రైతుకు నప్పే విధంగా గడ్డి, మట్టి, పచ్చి ఇటుకలతో గోడలు కట్టి చొప్పతో పైకప్పు నిర్మించి కుటీరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కాని సాధ్యపడలేదు. అందుకు ధనం, సమయం అధికంగా కావలసి వచ్చింది. అందరూ ఇంటి వాళ్ళే, కనుక వెంటనే కాయకష్టం చేయాలని తహతహలాడారు.

“ఇండియన్ ఒపీనియన్” పత్రికకు సంపాదకుడు మన్ సుఖలాల్. ఆయన ఈ వ్యవస్థలో చేరలేదు. డర్బనులోనే ఆయన బస. డర్బనులో ఇండియన్ ఒపీనియన్‌కు చిన్న శాఖ కూడా ఉన్నది.

కంపోజు పని చేసేందుకు మనుషులు అదనంగా ఉన్నారు. నిజానికి ముద్రణా కార్యక్రమంలో ఎక్కువ సమయం కంపోజు చేయడానికి పడుతుంది. అయితే అది తేలిక పనే. సంస్థలో వుండేవారంతా కంపోజు పని నేర్చుకోవాలని నిర్ణయించారు. దానితో ఆ పని తెలియని వారంతా నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. నేను మాత్రం ఈ వ్యవహారంలో వెనుకబడ్డాను. మగన్‌లాల్ గాంధీ మొదటి స్థానం సంపాదించాడు.

అసలు మగన్‌లాల్‌కు అతని శక్తి ఏమీటో తెలియదని అనుకునేవాణ్ణి. అతడు ఎన్నడూ ప్రెస్సు పని చేయలేదు. అయినా నేర్పరియగు కంపోజిటరు అయ్యాడు. వేగంలో కూడా బాగా పుంజుకున్నాడు. కొద్దిరోజుల్లోనే ప్రెస్సు పనంతా క్షుణ్ణంగా తెలుసుకొని అతడు విజయవంతంగా ప్రెస్సు పని నిర్వహించడం చూచి నేను నివ్వెరబోయాను. ఇంకా ఫినిక్సు వ్యవహారం ఒక ఒడ్డుకు చేరలేదు. ఇంతలో ఈ క్రొత్త కుటుంబాన్ని వదిలి నేను జోహన్సుబర్గు పరుగెత్తవలసి వచ్చింది. అక్కడి పనిని ఎక్కువ కాలం వదలి వుండగల స్థితిలో నేను లేను.

జోహన్సుబర్గు చేరి పోలక్‌తో ఈ పెద్దమార్పును గురించిన వ్యవహారమంతా చెప్పాను. తానిచ్చిన పుస్తకం ఇంతటి మార్పుకు కారణం అయిందని తెలిసి పోలక్ పొంగిపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. “నేను కూడా ఈ