పుట:సత్యశోధన.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

పిల్లల చదువు

ధార్మిక సంస్థలుగా చలామణి అవుతున్న అనేక సంస్థలకు లెక్కాడొక్కా ఏమీ ఉండదు. ధర్మకర్తలే వాటికి అధికారులుగా తయారవుతున్నారు. వారు ఎవ్వరికీ జవాబుదారీ వహించక అధికారం చలాయిస్తున్నారు. యిది సరికాదని నా అభిప్రాయం. ప్రకృతివలె యిట్టి సంస్థలు వాటంతట అవే పెరగాలని నా అభిప్రాయం. అది నా మతం. ఏ సంస్థకు ప్రజలు సాయం చేసేందుకు సిద్ధంకారో ఆ సంస్థ సార్వజనిక సంస్థయను పేరిట నడపడానికి వీలు వుండకూడదు. ఏ సార్వజనిక సంస్థకైనా ప్రజల సహకారం లభిస్తున్నదని ఎవరైనా చెబితే దానికి ప్రజల వల్ల లభించే చందాల పట్టికను చూడాలి. అదే ఆ సంస్థ యొక్క ధర్మకర్తల యోగ్యతకు, ఆసంస్థయొక్క ప్రజాపరపతికి ఒరిపిడిరాయి అన్నమాట. ప్రతి సంస్థ ఈ ఒరిపిడి రాయి మీద తన రాతను గీచి చూచుకోవాలని నా మతం. దీనికి ఎవ్వరూ దురర్థం చెప్పకుందురు గాక. శాశ్వత భవనాలు లేకపోతే కొన్ని సంస్థలు నడవవు. అట్టి సంస్థల్ని గురించి నేను యిక్కడ పేర్కొనడంలేదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్క విషయమే. ప్రతి సంవత్సరం తమ యిష్ట ప్రకారం జనం యిచ్చే చందాలతో సంస్థ వార్షిక వ్యయం చేయబడాలి. అలా జరిగితే ఆ సంస్థకు నైతిక స్ఫూర్తి చేకూరుతుంది.

దక్షిణ - ఆఫ్రికాలో సత్యాగ్రహ సమరం ముమ్మరంగా సాగినప్పుడు నా ఈ ఉద్దేశ్యాలు దృఢపడ్డాయి. లక్షలాదిరూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. అయినా మూలధనం లేకుండా ఆరు సంవత్సరాలపాటు ఆ మహాసంగ్రామం జరిపాము. చందాలు రాకపోతే రేపు యీ సంగ్రామం గతి ఏమవుతుందోనని మేము భయపడ్డ రోజులు కూడా వున్నాయి. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కదా! నాకు కలిగిన నిశ్చితాభిప్రాయాల్ని గురించి సందర్భాన్ని బట్టి ముందు వివరిస్తాను.

5. పిల్లల చదువు

1897 వ సంవత్సరం జనవరి నెల్లో డర్బనులో దిగాను. అప్పుడు నాతో మా ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. ఒకడు నా మేనల్లుడు. వాడికి పదేండ్ల వయస్సు. మిగిలిన యిద్దరూ నా కుమారులు. పెద్దవాడికి తొమ్మిదేండ్లు, చిన్నవాడికి అయిదేండ్లు. వీళ్ళకు చదువెట్లా అన్న సమస్య బయలుదేరింది.

నా పిల్లల్ని తెల్లవారి బడికి పంపగలను. అందుకు బాగా శ్రమపడాలి. నా పిల్లలకు మాత్రమే అట్టి వీలు కలుగుతుంది. కాని యితర భారతీయుల పిల్లలకు అట్టి వీలు దొరకదు. భారతీయ బాలుర కోసం మిషన్ వాళ్లు పెట్టిన బడులు వున్నాయి. కాని