పుట:సత్యభామాసాంత్వనము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23

     జిగిమీఱు తొగసౌరు మగరారుటపుపేరు
                    తళుకుముత్తెపుఁబేరు తమ్మిపేరు
     విలసిల్లుననరెల్లు తెలివల్లుకొనుజల్లు
                    లరదిగంబురజల్లు నురుగు[1]విల్లు
తే. నెల్లపుడు నుల్లమునఁ జాలఁ దల్లడిల్ల
     నల్లనల్లన మల్లాడి యుల్లసిల్లు
     తిరుమల[2]ధరేంద్రు వీరధాత్రీపచంద్రు
     కీర్తి జగతిని ననుపమస్ఫూర్తి మెఱయ.

క. క్షమ వీరేంద్రుఁడు మీనా
     క్షమ నలలింగాంబ నాజమాంభోజాతా
     క్షి మఱియును మధురనాయిక
     నమలమతిం బెండ్లియాడె ననుపమలీలన్.

తే. అట్లు మీనాక్షమ యయారె యాస లెంచి
     స్వామితో విగ్రహముఁ జేయఁజనక కఠిన
     చాపలత డించి యశ్రాంతసమరసత్వ
     పటిమ మధురాపురిని వీరపత్ని యయ్యె.

సీ. క్షితి యవిరతరజస్కతఁ గాంచి కోరనౌ
                    భర్త నెంతయుఁ గ్రిందుపడఁగఁజేసె
     లచ్చి యం చనఁ జంచలయె ఘనత నెనంగు
                    నేలినవానిఱొ మ్మెక్కి నిలిచె
     సతియె తాఁ బార్వతి శంకరుం డగువాని
                    నాత్మేశుఁ గదిసి మాఱాడఁదొడఁగె
     పతిదేవతయె తాను బాష దా తగువాని
                    ప్రాణనాయకుని నో రదుముకొనియె
తే. నని కువృత్తియును భృగుకలనయుఁ జండి
     తయును వ్యాహారరీతిఁ జెందకయ వసుమ

  1. పెల్లు
  2. నరేంద్రు