పుట:సత్యభామాసాంత్వనము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

సత్యభామాసాంత్వనము

సీ. పడియపట్ల నడంగు పగరాకుమారులఁ
                    జెలఁగి కొమ్మునఁ జీల్చి చిమ్ము ఘోణి
     పనులఁ గ్రుమ్మరుగొంటుపగకందుమన్నీలఁ
                    దఱిమి వెన్నాడు వేదండసమితి
     బిలమధ్యమున డాఁగు పెరవజీరుల గిట్టి
                    కమలించు నిట్టూర్పుకాఁకఁ జిల్వ
     కెలనఁ జరించుమొక్కలిగడిరాజులఁ
                    జెఱ నుంచు గుహలలోశిఖరికులము
తే. [1] తెలుచు వెలుపడఁ గమఠంబు నెలవు సొచ్చి
     వారి వెడలింపఁ బో నంత వసుధఁ దాల్చి
     తమశ్రమము దీర్చు తిరుమలధరణినాథ
     మణికిఁ బ్రత్యుపకృతి సేయ మనసుఁ బూని.

క. అల శ్రీ తిరుమలనాథుం
     డలమేలమయందుఁ గాంచె ననఘ పవిత్రో
     జ్జ్వలభవసాంద్రకీర్తులు
     వెలయంగఁ గుమారముద్దువీరనరేంద్రున్.

చ. భువిఁ జినముద్దువీరనృపపుంగవుపాణికృపాణభిన్నశా
     త్రవనృపదేహశోణితపరంపర యింపులు గుల్కె నూత్నవీ
     రవరణవేళ నెంతయు సురప్రమదాతతి యామతింపును
     త్సవము ఘటిల్లఁ బెల్లుగను చల్లిన చెంద్రిపుజల్లుకైవడిన్.

సీ. [2]వలిగట్టు వెలిపెట్టు కళలుట్టు నెలగుట్టు
                    [3]వేగంటిదొరచెట్టు వెండిగట్టు
     వినుజూలునినురాలునును[4]చాలుగనుమేలు
                    నలువబాబాలు క్రొన్ననలచాలు

  1. తొలుదొలుత దంభకమఠంబు నెలవు సొచ్చి
  2. వలిమెట్టు తెలిబట్టు; నులిమెట్టు నెలిబట్టు
  3. వెలగట్టిదొరచెట్టు
  4. బాలుగల