పుట:సత్యభామాసాంత్వనము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

సత్యభామాసాంత్వనము

     తియు జగన్మాత గౌరి వాగ్దేవి యనఁగ
     రంగలరె సద్గుణాలంబ లింగమాంబ.

చ. నిరుపమభర్తృభక్తి ధరణిం బొగ డొందెడునాజమాంబకున్
     సరి యనవచ్చు నెంతయును జాహ్నవి వెల్వెలఁబాఱ కోషధీ
     వరకలనాంతజాద్యవిషవర్తను భర్తను ధూర్తమౌళి యం
     చరయుచు సారెకున్ మొరసి యౌదల[1]మెట్టక యున్న నెన్నఁగన్.

క. లలితహరిభాషణ కుతూ
     హలవిజయ[2]యశస్సమంచితాత్మయునై తాఁ
     గలితసుభద్రాభిధయై
     యలరారున్ మధురనాయికాంబ గణింపన్.

సీ. తిరుమలమేదినీవరుముద్దువీరిధ
                    రాధినాథుండు మీనాక్షమాంబ
     యం దలచొక్కనాథవనీపాలు లిం
                    గాంబిక యందు ముద్గళఘరీంద్రు
     నాజమాంబికయందు నచ్యుతేంద్రుని చిన్న
                    యచ్యుతు మధురనాయకమయందు
     నారసింహక్షమానాథశిఖామణి
                    నెనలేని వేడుకల్ హెచ్చిలంగఁ
తే. గాంచె నెంతయఁ గల్పద్రుపంచకంబుఁ
     బాలమున్నీటిచందానఁ ప్రథితదాన
     [3]వర్తనంబును కీర్తివిస్ఫూర్తి మెఱయ
     సరససుమనోమనోవిలాసంబు మెఱయ.

మ. వెలయున్ వారల కగ్రజుండు సుకృతావిర్భూతబోధుండు ని
     ర్దళితానేకవిరోధియూథుఁ డహివర్యస్తుతమేధుండు సం
     జ్వలితాబింధనగంధవాహసఖదివ్యద్భవ్యతేజోవితా
     నలసద్గంధుడు చొక్కనాథధరణీనాథుండు భాగ్యోన్నతిన్.

  1. యొల్లక
  2. వచస్స
  3. వర్తనము వితతవిస్ఫూర్తి మెఱయ