పుట:సత్యభామాసాంత్వనము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9

     దోత్కర్షవేల్లితపల్లవాధరాకలితకనకవల్లకీవాచనుండును, మావిరి
     మాణవీరాయమర్మభేదనుండును, కోపప్రసాదచటులకుటిలాలోకననటిత
     కుశేశయవితానసంరంభకుంభస్తనీమోహనకుసుమసాయకుండును,
     కుంతూరిదుర్గనాయకుండును, తత్తాదృశశృంగారకృతిచమత్కృతితరంగిత
     సుకవిహృదయకంజరంజనాను[1]క్షణవీక్షితకటాక్షుండును, దక్షిణసింహాస
     నాధ్యక్షుండును, తిరుమలనృపాలకలశాంభోధిపూర్ణిమాశశాంకుండును,
     ధరణీవరాహాంకుండును, కల్యాణపరంపరోదారకుమారముద్దువీరనృప
     కల్పతరుతపఃఫలంబును, కమనీయగుణతరంగలింగాంబికాగర్భశుక్తి
     ముక్తాఫలంబును, మోహనతరవిలాసబాలికాజనలీలాలోలుండును నగు
     ముద్దళఘరిభూపాలుండు నీరజబాంధవుం డుదయింప నొక్కనాఁడు నిత్య
     కృత్యంబులు నిర్వర్తించి బలువగు మానికపుఁదొరవులు దొడిగి చెలువు
     మీఱఁ గొల్వుసింగారంబు చేసికొని యనితరసాధాణరీతిం గ్రందుకొన
     మందమందగతుల సౌధంబు డిగ్గి తనడగ్గఱం గ్రిక్కిరిసి యిరుపక్కియలం
     డెక్కులం బిక్కటిల్లు చక్కెరవిల్తుచిక్కటార్లవలె నెక్కువ పొగరుమేని
     టెక్కు లెక్కువ తక్కువ లేని చక్కని వయసునిక్కువగ జక్కవగుబ్బ
     లాండ్లు కర్పూరకస్తూరికాసంకుమదకుంకుమపంకకమలకర్పూరపుల్ల
     మల్లికాసముల్లసితసౌరభంబులు గమ్మునం గ్రమ్ముకొని కనకముకురకరండ
     కళాచికాకనకాలుకాకౌక్షేయకోపశోభితకరారవిందలై వెంబడింపఁ
     గొన్నియంతస్తులు దాటి [2]యట చన నంగనల నందఱ మగుడం గనుం
     గొని తదనంతరంబునఁ జెంతఁ జేరి కొందఱుమన్నీలు మునుమున్నుగా
     నూడిగంబులు ఘటియింప నెనలేనిరాజసంబు నటింప నిగనిగ నిగుడు
     తొగరాజుగతి సొగసుడంబు లంబుజంపుదృషదున్మేషనితంబాడంబరంబు
     విడంబింప నింపునింపుప్రాఁగెంపుగుంపుచెక్కడంపువగం దురంగలించు
     కట్టాణిముత్తియపుగట్టిచప్పరపుముంగిటిరంగు లర్యమమణిపర్యంత
     గిరిదర్యంతధరానటితకునటికాపటలోత్కటశోణిమగరిమ రాణింప గరగరిక
     దొరయు కట్టుడాలు జాలుకొను నీలంపుకంబంబులం గ్రందుకొను చెందొవ
     జిగిపొగరునిగుడఁ బగడపుబోదెలగుమిం బాదుకొను నునుపు తత్తత్ప్రదేశ

  1. క్షణపక్షహితకటాక్షుండును
  2. యచట