పుట:సత్యభామాసాంత్వనము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

సత్యభామాసాంత్వనము

     ధానసముత్తాలకరతాళభూత[1]వేతాలమండలుండును, సంవర్తసమయప్రవ
     ర్తమాననర్తనపౌష్కల్యపుష్కలావర్తఘర్షరనిర్ఘోషానుసంధానసమింధాన
     మంధాసశిఖరిసంధితకలశసింధుబంధుగగనజంఘాలతావిశృంఖలతరంగ
     సంఘసంఘటితఘమఘుమారవగౌరవహృతిభైరవదుందుభిబృంద
     కందళితనినాదమేదురితచక్రవాళాంతరాళుండును, కరాళకరతాళధార
     ధారాధారాళనీరపూరకోరకితయశఃకుసుమజాలకరవాలుండును, హృద్యాన
     వద్యతనగరంతకాంతశశికాంతసౌధాంతరహర్నిశవిహరమాణవిదేహ
     కన్యకామణీనిస్తులస్తనకనకకలశకనదకలంకకుంకుమపంకసంకలనచంక
     నన్మకరాంకసూచితమకరాంకవిజయాంకనోన్నిద్రరామభద్రపూజా
     జాయమానవిశ్వవిశ్వంభరాభరణవిశ్రుతశాశ్వతైశ్వర్యధుర్యుండును,
     తరంగవతీభుజంగశిఖరిపుంగవరంగదభంగసాంగత్యసంభావితగాంభీర్య
     ధైర్యుండును, వినిద్రతరప్రభావప్రథమానప్రయత్నషడధికదశమహా
     రాజప్రాదేశసాదేశనిస్తులతులాపురుషాదికదైనందినమహాదానమహిమా
     పహసితకౌమారగురుకల్పతరుకామధేనుకమలవైరికర్ణకనకగిరికలశజలనిధా
     నుండును, కరుణావిశేషషోడషాడ్గుణ్యమంత్రస్వతంత్రతానిధానమహా
     ప్రధానుండును, పుష్కలజయావిష్కరణదుష్కరతరసమరముష్కర
     తురుష్కధానుష్కధనంజయనిష్కాసనోద్దీపితప్రతాపనారాయణుండును,
     ప్రతిదినకృతభారతభాగవతరామాయణపారాయణుండును, అక్షీణత[2]రక్షు
     కులకోలాహలరూక్షభాషణభీషణవేషవిద్వేషణమహీపకూలంకషకోపరస
     ప్రతికోటితదీయకోటీరకోటీచిరత్నరత్నవిసరనవకిసలయాస్తరణకలితసంచ
     రణకోమలచరణుండును, పంచతిరువళిరాజసప్తాంగహరణుండును, ఖండేందు
     ధరాచండకరణమండలశరపాండురకాండజకందర్పకాండకలశకాండాది
     డిండీరగరుడతుండపులోమఖండిశుండాలశరత్కాండగౌడవదండమండల
     ప్రకాండవేదండరిపుదండనాఖండస్ఫూర్తికీర్తిపరికర్పూరపూరితకనకకరం
     డాయమానబ్రహ్మాండుండును, నారుహన్నిబ్బరగండుండుసు, మదవద
     ఖిలభువనజంపతీధృతిలుంపనసంపద్యమానమానససంపదుదంచితవంచనా
     ప్రపంచితపంచశరపంచశరీవికర్షణవర్షితమకరందవర్షబృందసందేహ

  1. భేతాళ
  2. రక్షక్ష్వేళాత్వ