పుట:సత్యభామాసాంత్వనము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

సత్యభామాసాంత్వనము

     భామ నీనుడికోపు భావజుననివైపు
                    దరిదాపుగా నెంచి దాఁచుకొననొ
     మగువ నీనెమ్మోము [1]మదనునిసముగోము
                    సొలయక దీముగాఁ జూచుకొననొ
తే. కాక యొకసారి యైన నే గడుసుపొఱి
     బిగిసినది లేదు కలనైనఁ దెగువరాదు
     విన్నవించితి నేఁ డింక వినుట పాడి
     వలదు నామీఁద నీమోడి వన్నెలాఁడి.

ఆ. ఇమ్ము గ్రమ్మఁ గౌఁగి లిమ్ము నెమ్మది వింత
     చాలు వీలు మేలు [2]మేలు మేలు
     నమ్మికొమ్ము బాస నమ్మి కొ మ్మిఁక నన్ను
     బాల తాళఁజాల మేల మేల.

క. అని కొంతకొంత కోమలి
     మనమునఁ గళ్లకము దోఁచి మగుడ నిగుడున
     ల్క నగుచుఁ జూపుంజుఱచుఱ
     పెనగొన హృజ్జాతభీతిభీతాశయయై.

సీ. తళు కెత్తుచిఱునవ్వుమొలకలు జడిగొను
                    పన్నీటివలెను పై పైని నిండఁ
     దడి యొత్తుచెంగావినిడుద పావడవలెఁ
                    గెంపుపోఁగులచాయ గుంపుకొనఁగ
     నొసటికస్తురిబొట్టుమిసమిస ల్చెమరిన
                    గోవజవ్వాది చెక్కుల నటింప
     మెఱుఁగారువలెవాటుసరిగకుచ్చులగచ్చు
                    బంగారుపూవులరంగు నెఱప
తే. మరునివిరిగోలయేటున నొరగినట్లు
     నెలకుఁ దామరలకుఁ జెల్మి నెఱపునట్లు

  1. మరునినామముగోము
  2. జాలమేల