పుట:సత్ప్రవర్తనము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సత్ప్రవర్తనము

73

రెండుకన్నులు చాలవని వారికిం దోఁచెను. వాని నెంతయో వేడ్కతో నెగఁ జూచుచుండిరి. ఆఫలవృక్షముల కొమ్మల తుదలఁగూరుచుండి చిలుకలు ముద్దులొలుకుపలుకులఁగాలము గడపుచుండెను. అందుఁ గొన్ని బూడిదరంగుగలవి. మఱికొన్ని పచ్చనివర్ణము కలవి. ఇంకఁగొన్ని యైదువిధములగు కాంతులు గలవి. ముఱియుఁ గొన్ని రెండువర్ణములే కలవి. వానింజూచి నిలువంబడి “నెయ్యుఁడా! వానింజూచితివే? ఎంత బాగున్నవి! నేత్రముల కింతకంటే నానందము కలుగు నవకాశము దొరకునా? మంచిపక్షులుగదా యివి. మాంసాహారమును గోనవు. ఫలములను బీజములను భక్షించును. ఎవ్వరికిని హానిచేయునవికావు చూడుమా అల్లది మగచిలుక కాఁబోలును. తాఁదెచ్చిన యాహారమును బ్రీతిమై చెంతనున్న ప్రియురాలి కిడుచున్నది. ఓహో! దానిప్రక్కనున్నవి పిల్లలు కాఁబోలు. నోరుతెఱచి యాహారమును బెట్టుమని బతిమాలుచున్నట్లున్నవి. అల్లదె కంటివే. మగఁడు తననోటిలోఁ బెట్టిన యాహారమును బిల్లలనోటిలో నాయాఁడుపిట్ట పెట్టుచున్నది. ఒక్కసారి యెన్ని పిల్లలు నోరుతెఱుచుచున్నవో చూచితివా? చూచితివా ఇంతలో మగపిట్ట యెక్కడికో పోవుచున్నది. పాపము! కలహించియే కాఁబోలును ? అల్లదిగో మదల నామగపిట్ట వచ్చుచున్నది. వీటికో? త్వరగాఁ జూడుము. తాఁ దెచ్చిన యాహారమును మరలఁ బత్నినోటిలో నిడుచున్నది. చక్కఁగాఁ జూడుము. అది యెంత ప్రీతితో సందుకొనుచున్నదో. నోరు నోటితోఁ గలుపుచున్నది. పక్షములగాలిచే భర్తకుపచారము చేయుచున్నది. పిల్లలు చుట్టు నున్నవి. చూడఁజూడ వేడుకగా

---ది ఔరా! ఆర్యకుటుంబము లిట్లు పరస్పర సద్భావము

6