పుట:సత్ప్రవర్తనము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

35


గలరని సారము. కొందఱు వేళకు సరిగాఁ జేయఁదగిన దానిని జేయక యెప్పుడో యొకప్పుడద్దానం జేయుదురు. వారికడ లక్ష్మీ నిలుపదు. మఱికొంద ఱాచార వంతులమని చెప్పుకొనుదురు. వారు దరిద్రులుగనే యుందురు, కారణ మేవనంగా 'వారు ప్రాయశః సశాలమున నాయా కార్యములను జేయరు. ఇట్టి యాచారనంతులను లక్ష్మి యాశ్రయింపక యాచార విహీనుల నా శ్రయించునని పెక్కండ్రా క్షేపింతురు. కాని వారి కద్దానికింగల హేతువిట్టిదని తెలియ లేదనవచ్చును ఆచారము, ' దానము లోసగునవి సత్కార్యములే. అవి భగవంతునకు నిఫ్టములే ఐన నట్టి వారిని వదలి లక్ష్మి, యితరుల నాశ్రయించుటేల యని యడుగుదు రేని యితరులని మీరనువారు కాలము నారాధించు వారు. కాలము నించుకంతయు వృథ చేయక కార్యములను జరుపువారు. కాలము భగవత్స్వరూపమే కాన వారు భగవంతునే యాధించువారలగుట మహాలక్ష్మీ వారియెడల బ్రసన్నులగుకు యొక వింత గాదు. ఆంగ్ల దేశీయులు సంఖ్యా ద్యనుష్టానముల జరుపువారు గాకున్నను కాలమునే ప్రధానముగా భావించు వారు, కాలము మన్నించుటయే భగవంతు నారాధించుటయని యర్థము. కావున భగవంతునిఁ పయి భక్తిగలవారల యెడ మహాలక్ష్మి యనుగ్రహము కలదిగ నుండుట న్యాయమే కదా. అట్టులగుటం జేసి యాంగ్ల దేశీయులు సకల భూభారవహనక్షము లైరి. అదియెఱుంగక కొందఱాక్షేపింతురుగాని వారొనరించు సత్కార్యముల నెఱుంగరు. ఇదియే 'కాలారాధన పద్దతీ,


ఆవిద్యార్థులు సీతారామవర్మ కడ మాటయిచ్చినట్లే పోయి ఖిన్నులై యున్న విద్యార్థులకడకుం బోయిరి. వారు.