పుట:సత్ప్రవర్తనము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

సత్ప్రవర్తనము.


పూర్వులు సర్వస్వము వదలుకొనిరి. మనము నిన్న గాక మొన్న నేకదా యట్టి పాఠములఁ జదివితమి. ఇంతలో మఱచితిరా? మీరును సావధానముగా యోజింపుడని చక్కగా నుపన్యసించెను.తమమిత్రుని వాఖ్యముల వారాలకించు కొలదిని వారికం బట్టుపడియున్న ముచ్చకము పట్టుదలయుఁ దగ్గఁ జొచ్చెడు. సితా రామరామవర్మ యుపన్యాసము మానిన కొలది నిముసములకే వారిమోములు కలంక దేఱినట్లయ్యెను. వారెల్ల నొక్క మాటగా నాపట్టుదలను మానితమనిరి. నీవంటి మిత్రుడు మాకు వేఱొక్కడు దొరకునే యనిరి. అందొక రిద్దరు 'మేమిపుడ పోయి తొలుత విషాదము నొందిన విద్యార్థులకు దెలుపుదుమనియు వారిని బ్రసస్ను లగునట్టు లొనరించి కాని రామనియు శపథము చేసిరి, మీ కార్యము చేయుఁడని వర్మ మఱింత గట్టిగాఁ జెప్పెను. వారుసు బద్ధకంకణులై బయలువెడలిరి.


'కాలము భగవత్స్వరూపము దానియుదంతము నెఱింగిన వారు లోకముల నగుదుగ నుందురు. భగవతత్తం మేఱింగిన వారు కాని కాలతత్వ మెఱుంగఁజాలరు. దానియందిట్టిమార్పు లిప్పుడు కలుగునని యెవ్వరును జెప్పఁజాలరు. 'కాలమే సర్వ "కార్యములకు నాదారము. అట్టి కాలమును గ్రమము తప్పక యారాధించువార లఖండ లక్ష్మీధురంధరులగుదురు. కాలము 'నారాధించుటనఁగాఁ బూవులతోఁ బూజించుట యని కాదు. చేయఁదగుపని సొలసింపక చేయుట యని యర్దము, ఏకాలమున "నేపని చేయఁదగునో యద్దాని నాకాలమునకు శ్రద్ధకలిగి చేయువా "రెవ్వరో వారలే యఖండ లక్ష్మీని 'బడసి సుఖంప "