పుట:సత్ప్రవర్తనము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

33


గలిసికొని యథోచితముగ మాటలాడి వారి మనస్థితిఁ దెలిసి కొని దుప్పటివారికోపము కల్పితకుని యెఱింగి మెలమెల్లన గురుశిష్యన్యాయము బోధపడునట్లు మాటలాడఁ బూనెను, మిత్రములారా ! పెద్దలమాటల నాలకించి నాని యనుమతి చొప్పున మెలఁగుట బాలుర ధర్మము. దాన నెంతయో మేలు చేకూరును. అనేక విషయముల ననుభవపూర్వకముగ నెఱింగినవారుపాధ్యాయులు. మనకట్టి యనుభవములు లేవు. వారికిఁ గొందఱయందుఁ బక్ష పాతము గలుగ నలసిన యక్కఱయే లేదు, మన మింత కాలము నుండి మాచుచున్నాము. ఒక్క కార్యమునఁ బెక్కండ్రు. ప్రవృత్తులైన నొక్కనికే ఫలము కలుగును. తక్కినవారు దుఃఖపడవలయునా? ఆ ఫల మాతని "కేల కల్పించితిరని యుపాధ్యాయుల నాక్షేపించవచ్చునా? ఇం దేదియు యుక్తము కాదు. ఇప్పటిస్థితి యట్టి దేకచా. ఈ స్వల్ప విషయమున కిట్టి దుష్ప్రయత్నము చేయఁదగునా యోజింపుఁడు. తుదకు శాంతికి లోపమే కాని గాదగిన ఫలమేమియు లేదు, ఆయిరువుర విషయమై యుపాధ్యాయులకుఁ బక్షపాత మున్నదని యెట్లు చెప్పవచ్చును? ఎన్ను కొను వారు విద్యార్థులే కదా? ఉపాధ్యాయులు పురికొలుప వారిని దోసి వేసిననుట వ్యర్థాలాపము. ఆపుడు విద్యార్థుల బుద్దు లేమాయె! మీరునీవిషయమై యించుక మనశ్శాంతిగలిగి యూహింపుఁడు. ఇట్టి కట్టుపాటు మంచిదా కాదా యనియు నాలోచింపుఁడు. లోకులు మనలఁ జూచి యేవగింతుకు తల్లిదండులు చింతింతురు. బేల తనమున మనమిట్టి జోలికింబోయితిమని యెల్లరు పల్కుదురు. లోకాపవాదము నకు భయంపడవలదా ! "లోకాపవాదాద్భయ” మ్మన వినమే. సత్కీర్తిని సంపాదింపంగోరికదా మన