పుట:సత్ప్రవర్తనము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సత్ప్రవర్తనము.


లున్నందున 'నేమాత్రమో యధికార మున్నదనవచ్చును. ధనము వలసినయంత కలదు. అవివేకిత్య సంపదయుఁ గలదనుట కేశంకయు లేదు. కావున నీతఁడు చేయరాని దుష్కార్యము లుండవు. ఈనడుము నీతఁ డింటికింగూడ కాక కుముదవల్లిలోనే యున్నట్లు విన్నాఁడను, . ఈవిషయమునఁ గృషి చేయుట కొఱకే కాబోలు ఇప్పటి దుష్టబాలురందరూ నతని మిత్ర, మండలమునఁ జేరినవారే ఈతనివలని ధనము సంపాదించువారలే ఈకుతంత్ర మెల్ల నీతనిదే యని యిపుడు దృఢపడు చున్నది. ఇంతటితోఁ దీఱదు. ఎన్నియో యనర్ణములను గల్పించును. ఇట్టి దురభ్యాసములు పట్టుపడరాదు. పట్టుపడునేని వదలవనుట సత్యము, వీని నెల్ల దొలఁగించు సుపాయము "నేనేమైనఁ జేచుఁగలనా? కుయత్నము చేసినఁగాని యది తేలదు. ప్రయత్నము ఫలింపకున్న నొక చింత మనస్సునఁ 'బాదు కొనును. అది నిరంతరము నన్ను బాధించుచునే యుండును. అట్టులని యూరక యుండరాదు, ఊరకయుండుట కాపురుష లక్షణము.

శా.ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాసంత్రుప్తులై
మారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్నునిహన్య మానులగుచున్ దృత్యున్నతో త్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్నానీధుల్ గావునన్ .

అన్న సూక్తి సర్వసమ్మతమే యగుఁగదా. కావున నా యోపి నంత నట్టు ప్రయత్నించి చూచెదను.

కృతనిశ్చయండై యప్పుడ జనకునానతిం గైకొని కుముదవల్లికిం బోయి యందుఁ దనమాట నాదరించు బాలుర