పుట:సత్ప్రవర్తనము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

సత్ప్రవర్తనము.


యథావూర్వముగాఁ జదువుకొనుచుండిరి. వీరింజూడఁగనే యాదరించిరి. నవ్వుచు నేమాటలాడిరి. వీరందుల కచ్చెరువు పడి యిదేమో విచిత్రముగనున్న దేయనిరి. మీ భేదమును దెలియఁ గోరి వచ్చితిమనిరి. మాకు విన్న దనమేమి కలదు? అని వారు ప్రశ్నించిరి. పరస్పర మించుకతడ వీసంభాషణము సాగించిరి. రాయబారుల కిది నడుమ నెవరో కల్పించినదే కాని వాస్తవముగ 'నేమియు నిట లేదని తెలిసెను. మర్మము లేక తముపచ్చినపని వారికెఱింగింప వారు పక్కున నవ్విరి. ఈ చిక్కులు మావలనఁ గలిగినవి కావనిరి, మాకప్పుడు విచారమే లేదనిరి. మమ్మెన్ని కొనక పోయినపుడించుక మనః బేదము కలిగెను, ఉత్తరక్షణమున నడంగెను. విద్యార్తులు కట్టుగా బాఠశాల మానుట 'మేమును వినియే యూరకయున్నారము. అంతీయ కాని 'మేమందులకు గారణభూతులము కాము. అను నీమూటలు వారినోటనుండి వెడలగనే రాయబారు "లింత యో సంతోషము 'మోములఁ గలయపర్వముగా మేమరిగి సీతారామ వర్మకు దెలిపి యనంతర కార్య మొనరింతుమని వారియనుమతి నొంది వెవేగవచ్చి యయ్యుదంతమంతయుఁ దమమిత్రులకుం దెల్పిరి. ఆవార్తయమృత ధారవలె శ్రుతిపుట వేయము "కాఁగా నారినిమఱికొందఱను బిలుచుకొని పాఠశాలాధికారిడకుం బోయెను.

సహా యోపాధ్యాయులం గూడి శర్తవ్యమాలో చించుచు సతండుండెను, సీతారామవర్మ, మిత్రులం గూడి వచ్చినాడని సేవకుడు తెలుప బట్టరాని యానందమున “అబ్బాయీ! రమ్మని పిలిచెను. ఎల్లరి లోపలికిం బోయి నాకియనుమతిని గూరుచుండిరి. వీరి రాకచే సుపాధ్యాయుల