పుట:సత్ప్రవర్తనము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

సత్ప్రవర్తనము.

బ్రయత్నించుట లగ్గనుటయే సిద్ధాంతమయ్యెను. మఱుదినమ వ్యారీని బాఠశాలనుండి తఱిమి వేయవలయు నసుమాట యంగీ కృతమయ్యెను. సభ చాలించి యెవరీండ్లకు వారు పోయిరి.

మఱుదిన ముదయముననే పాఠశాల వాకిటయందే యొక ప్రకటన పత్రము దృగ్గోచర మయ్యెను. "బాలకుల శాంతిం జెఱుపబూనిన కొందరు బాలురను పాఠశాలనుండి త్రోసి వేయుచున్నాము. ప్రవృత్తి మంచిది గాకుండుటయే వారి కీయిడుము రాగారణము.. వారివలన నెల్లరకు దురుద్దేశములు పట్టువుడునని తోచినందున నీ కార్యము చేయవలసి వచ్చెను, వారును దమయపరాధముల నివేదించి క్షమింపుఁడని వేడిన నాలోచింపఁ బడును, పాఠశాలాధికారి,” అని యందుండెసు. ఒక్కరొక్కరుగా పచ్చి బాలకు లాప్రకటనము గాంచి భయంపడు వారును, కానీ చూతమును వారును, మఱింత పట్టుదలఁ జూపవలసినదే కాని లొంగరాదను వారును, ధమ తప్పులు నుపాధ్యాయు లొక్పుకొన్న గానీ మరల నీ పాఠశాల మొగముకూడఁ జూడరాదనువారును, అందరెట్లో మనచుట్టే పవర్తింతమను వారునుగా బాలురెల్లరు వచ్చుచుంబోవుచు గుస గుసలాడుచు నొకరి నొకరు హెచ్చరించుచు నాగ్రహించుచు 'బండ్లు గీటుచు మోము చిట్లించుచు నుపన్యసించుచు నీదినము 'పొఠశాల , కేవ్వరు పోవరాదని ప్రమాణములు చేయించు కొనుచుఁ గలవరపడుచుండిరి. గ్రామమునఁగల 'పెద్ద లెల్ల నేమియు ననజాలక కొందరుపాధ్యాయులను మణికొందఱు 'బాలుకను నిందించుచుండిరి. ఆదినము వేళ కొక్కడైనా 'రాగూడదని బాలురు చాటుచుండిరి. గ్రామమంతయు నీవారలతో నిండియుండెను.